Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b32815f-67c4-432b-b7a4-cf12debd4382-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b32815f-67c4-432b-b7a4-cf12debd4382-415x250-IndiaHerald.jpg70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గానూ ఈ పురస్కారాలు అందించారు.70వ నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటిగా తిరుచిత్రంబళం సినిమాకు గాను నటి నిత్యామీనన్ కు అవార్డు వరించింది. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు నిత్య మీనన్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యామీనన్ మలయాళంలో ఆకాశ గోపురం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిందిsocialstars lifestyle{#}Shobhana;nithya new;nithya menon;December;Kannada;Comedy;central government;Ala Modalaindi;Heroine;News;Cinemaనేషనల్ అవార్డ్ ఎంపికపై నిత్యమేనన్ రియాక్షన్ ఇదే..!!నేషనల్ అవార్డ్ ఎంపికపై నిత్యమేనన్ రియాక్షన్ ఇదే..!!socialstars lifestyle{#}Shobhana;nithya new;nithya menon;December;Kannada;Comedy;central government;Ala Modalaindi;Heroine;News;CinemaMon, 19 Aug 2024 12:50:49 GMT70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గానూ ఈ పురస్కారాలు అందించారు.70వ నేషనల్ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటిగా తిరుచిత్రంబళం సినిమాకు గాను నటి నిత్యామీనన్ కు అవార్డు వరించింది. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు నిత్య మీనన్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యామీనన్ మలయాళంలో ఆకాశ గోపురం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో నిత్య మీనన్ కు బాగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నిత్య మీనన్ అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేస్తూ బిజీగానే ఉంది. నిత్య మీనన్ సింగర్ కూడా. ఇప్పటికే పలు భాషల్లో అనేక పాటలు పాడింది.ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరుచిత్రంబళం సినిమాలో నిత్య మీనన్ శోభన పాత్రలో ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా అదరగొట్టేసింది. దీంతో ఈ సినిమాలోని నిత్య చేసిన పాత్రకు ఇప్పుడు నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వరించింది. ఆల్రెడీ ఇదే పాత్రకు ఇటీవలే నిత్య మీనన్ ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది. ''అవార్డులను ఆశించి పాత్రలను ఎంచుకునే నటిని కాదు'' అని అంటోంది కథానాయిక నిత్యామేనన్‌. కథల ఎంపికలో ప్రత్యేకతను చూపించే ఈ భామ..ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. 'తిరుచిత్రాంబళం'లోని శోభన పాత్రకు గానూ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుందీమె. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య.. ఈ అవార్డును గెలుచుకోవడం..

సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న విమర్శల గురించి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది.నేను ఇంట్లో.. నా మిత్రులతో కలిసి రాబోయే ప్రాజెక్టు గురించి చర్చిస్తున్నా. అదే సమయంలో ధనుష్‌ ఫోన్‌ చేసి 'అభినందనలు..నీకు జాతీయ అవార్డు వచ్చింది'' అని చెప్పారు. ఆయన నాతో జోక్‌ చేస్తున్నారని అనుకున్నాను. ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు. ఈ అవార్డును ప్రకటించినప్పటి నుంచి వరుసగా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి.నా ఫోన్‌ నంబరు ఇంత మంది దగ్గర ఉందా..? నాకు అవార్డు వస్తే సంతోషించే వాళ్లు ఇంతమంది ఉన్నారా..? అని ఆశ్చర్యానికి గురయ్యాను. ఈ విజయాన్ని అభిమానులు వారి వ్యక్తిగత గెలుపుగా అనుకొని సంబరాలు చేసుకుంటున్నారు.నిజంగా ఇదొక అదృష్టంలా భావిస్తున్నాను. నేను అస్సలు ఊహించలేని పురస్కారమిది.''జాతీయ అవార్డు గెలుచుకునేంత స్థాయి ఈ పాత్రకు లేదని చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతున్నారు. 'ఇందులో భారీ యాక్షన్‌ సన్నివేశాలు లేవు.. రొమాంటిక్‌ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా..?అని విమర్శిస్తున్నారు. యాక్షన్‌ సినిమాల స్క్రిప్ట్‌లను ఎవరైనా రాయగలరు. కానీ కామెడీ కథల్ని రాయడం అంత సులభం కాదు. ఇలాంటి చిత్రాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర నిరూపించింది.

ఈ చిత్రంలోని మిగతా పాత్రలు నేను చేయగలనా..? అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇందులో ఏ పాత్ర ఇచ్చినా నేను నటించగలను. కానీ..నాకు సంతోషాన్ని కలిగించే పాత్రలు చేస్తేనే తృప్తిగా ఉంటుంది.జానర్‌..కథను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం శోభన పాత్రలోని నా నటనను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను''.
''చిత్రపరిశ్రమలోకి ఎలాంటి లక్ష్యంతో వచ్చానో..ఇప్పటికీ అలాగే ఉన్నాను. ప్రేక్షకులను ఉత్తేజపరిచే సినిమాల్ని ఎంచుకోవడమే నా లక్ష్యం. కొంత మంది వారి అభిమాన నటుల్ని.. ఎప్పటికీ వినోదం అందించే చిత్రాల్లో మాత్రమే చూడాలని అనుకుంటారు.అందులో నేనూ ఒకదాన్ని. యాక్షన్‌.. హారర్‌ లాంటి జానర్‌లో నటించడానికి చాలా మంది నటులు ఉన్నారు. నేనూ ఇలాంటి కథల్లో నటించగలను.కానీ..ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు పాత్రలు చేస్తూ..వారిని సంతోష పెట్టడమే నా లక్ష్యం. అవార్డులను ఆశించి పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడే నటిని కాదు''.
''నేను ఎలాంటి పాత్రలు ఎంచుకుంటానో దర్శకనిర్మాతలకు.. ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకున్న నటిని.కాబట్టి నా స్థాయి మారిపోయి.. సినిమాల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తానని అందరూ అనుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. నేను నటించే చిత్రాలు..నా టీమ్‌ ఇవేవీ మారవు. ప్రస్తుతం నేను 'డియర్‌ ఎక్సెస్‌' సినిమా చిత్రీకరణలో ఉన్నాను. దీని తదుపరి విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నాను. ఇది రొమాంటిక్‌ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న చిత్రం''.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>