MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41941dda-8376-4907-9ecf-38dcf8687d02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas41941dda-8376-4907-9ecf-38dcf8687d02-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు చాలా లౌక్యంగా మెలుగుతూ ఉంటారు. కానీ కొంత మంది నిర్మాతలు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో దిల్ రాజు ఒకరు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఓ సినిమాకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ను ఈయన చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం మేము ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే సినిమాలు తెరకెక్కించాం. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని మేము చిత్రీకరణ సమయంలో అనుకున్prabhas{#}munna producer;vamsi;vamsi paidipally;Maha;Interview;Blockbuster hit;Prabhas;dil raju;Josh;Cinemaనీ సినిమా పోయింది.. ప్రభాస్ మొహం మీద చెప్పేసిన నిర్మాత..!నీ సినిమా పోయింది.. ప్రభాస్ మొహం మీద చెప్పేసిన నిర్మాత..!prabhas{#}munna producer;vamsi;vamsi paidipally;Maha;Interview;Blockbuster hit;Prabhas;dil raju;Josh;CinemaMon, 19 Aug 2024 14:51:37 GMTసినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు చాలా లౌక్యంగా మెలుగుతూ ఉంటారు. కానీ కొంత మంది నిర్మాతలు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో దిల్ రాజు ఒకరు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఓ సినిమాకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ను ఈయన చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం మేము ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మున్నా అనే సినిమాలు తెరకెక్కించాం. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని మేము చిత్రీకరణ సమయంలో అనుకున్నాం. 

ఇక సినిమా విడుదల అయింది. నేను ఆ సినిమాకు సంబంధించిన షో ను థియేటర్లో జనాల మధ్యలో చూశాను. జనాల నుండి అంత గొప్ప రెస్పాన్స్ రావడం లేదు అని నాకు అనిపించింది. నాకు కూడా సినిమా యావరేజ్ అవుతుంది అని అనిపించింది. ఇక సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఇంటికి వెళ్లాను. ఇక అక్కడ ఆయన సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది అనే జోష్ లో తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక నేను ప్రభాస్ దగ్గరికి వెళ్లి స్వారీ ప్రభాస్ నీకు భారీ హిట్ ఇవ్వలేకపోయాను అని అన్నాను. దానితో ప్రభాస్ ఏంటి సార్ అంతా బ్లాక్ బస్టర్ అంటున్నారు అన్నాడు.

దానితో నేను అదంతా రాంగ్ న్యూస్. సినిమా యావరేజ్ ... మహా అయితే ఎంతో యావరేజ్ అవుతుంది కానీ బ్లాక్ బాస్టర్ మాత్రం కాదు అలా నువ్వు ఫిక్స్ గా అన్నాను. చివరకు రిజల్ట్ అలానే వచ్చింది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక మున్నా సినిమా పెద్దగా ఆడక పోవడంతో వంశీ కూడా డిసప్పాయింట్ అయ్యాడు. కాకపోతే నేను ... నువ్వు సినిమా బాగానే చేశావు. కథ విషయంలో లోపాలు ఎదురయ్యాయి అని ఆయనకు చెప్పాను అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>