PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-pinchan-name-removie284245d6-1d36-465e-bb07-6340e45dcc31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-pinchan-name-removie284245d6-1d36-465e-bb07-6340e45dcc31-415x250-IndiaHerald.jpgకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లను కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల పింఛన్ ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లుగా అధికారులకు నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలలో టిడిపి, జనసేన ,బిజెపి నాయకులు తమకు నచ్చని వారి పింఛనీలను సైతం టార్గెట్ చేస్తూ వారి పింఛన్లను ఆపివేసేలా చూస్తున్నారట. ఈ క్రమంలోని వారి పింఛన్లను సైతం తొలగించేందుకు సిద్ధమైనటAP PINCHAN;NAME REMOVIE{#}satya;Vijayanagaram;Srikakulam;Government;Vizianagaram;Annamayya;Janasena;Newsఏపీ: పింఛన్ల కత్తిరింపు మొదలా..?ఏపీ: పింఛన్ల కత్తిరింపు మొదలా..?AP PINCHAN;NAME REMOVIE{#}satya;Vijayanagaram;Srikakulam;Government;Vizianagaram;Annamayya;Janasena;NewsMon, 19 Aug 2024 07:36:00 GMTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లను కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్నటువంటి  లబ్ధిదారుల పింఛన్ ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లుగా అధికారులకు నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలలో టిడిపి, జనసేన ,బిజెపి నాయకులు తమకు నచ్చని వారి పింఛనీలను సైతం టార్గెట్ చేస్తూ వారి పింఛన్లను ఆపివేసేలా చూస్తున్నారట. ఈ క్రమంలోని వారి పింఛన్లను సైతం తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


ఇక వీరి పేర్లను కూడా అనర్హులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సామాజిక పింఛన్ ఆన్లైన్ పోర్టల్ లోనుంచి కూడా వీరి పేర్లను తొలగించే విధంగా మండల ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు కూడా ఆదేశాలను జారీ చేసిందట. గత ఐదేళ్లలో ఒకటవ తారీఖున పింఛన్ ని ఇంటి వద్దకే తీసుకువచ్చిన వాలంటరీలను ఇప్పుడు పట్టించుకోవడం లేదు..ఇప్పుడు మళ్లీ రాజకీయ ఒత్తుల వల్ల 2014-19  మధ్యలో జన్మభూమి కమిటీల ద్వారా ఇప్పుడు మళ్లీ పింఛన్లను యధావిధిగా చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు పింఛన్లు అందచేసే విధంగా సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.


అలాగే దివ్యాంగులు తమ శరీర వైకల్యాలను సైతం ప్రభుత్వ వైద్యుల పరీక్షలతో నిర్ణయించుకున్న తర్వాతే అతను దివ్యాంగుడని నిరూపించుకుని సర్టిఫికెట్ పొందాలని అందుకు సదరంలో పేర్లు కూడా నమోదు చేసుకోవడానికి మూడు నెలలు స్లాట్ ను విడుదల చేస్తున్నట్లుగా తెలియజేశారు. అలా ప్రతి గ్రామంలో కూడా ఇలానే చేయాలని చూస్తున్నారట. శరీర వైకల్యాలకు 15 రోజులలోనే కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి మళ్ళీ జన్మభూమి కమిటీలో సబ్మిట్ చేయాలని అలాంటి పింఛన్లనే ఉంచేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంతే చాలామంది కూడా అంగవైకల్యం లేకపోయినా తీసుకుంటున్నారనే రూమర్స్ రావడంతో ఇలాంటి పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలా ఇప్పటికే పలనాడు జిల్లాలో 209 మంది, అన్నమయ్య జిల్లాలో 13 మంది, విజయనగరం జిల్లాలో 60 మంది, శ్రీకాకుళం జిల్లాలో 8 మంది, సత్య సాయి జిల్లాలో 730 మంది, ఇలా ప్రతి జిల్లాలో కూడా కొంతమంది పింఛన్లను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>