HealthFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/foodpoision279c73c5-0886-4258-b0f1-48e2da968b7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/foodpoision279c73c5-0886-4258-b0f1-48e2da968b7d-415x250-IndiaHerald.jpgఅనకాపల్లి జిల్లా కైలాసలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసాలు తిని శనివారంనాడు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇవాళ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.చనిపోయిన వారిలో భవాని, శ్రద్ధ, జాషువా ఉన్నారు. మరో 24 మందికి అనకాపల్లి, నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలfoodpoision{#}Anakapalle;Vishakapatnam;mandalam;students;District;Parents;police;News;monday;Saturdayఅనకాపల్లి: ఘోరం.. చిన్నారుల ప్రాణాలు బలిగొన్న అల్పాహారం..!అనకాపల్లి: ఘోరం.. చిన్నారుల ప్రాణాలు బలిగొన్న అల్పాహారం..!foodpoision{#}Anakapalle;Vishakapatnam;mandalam;students;District;Parents;police;News;monday;SaturdayMon, 19 Aug 2024 22:40:00 GMTఅనకాపల్లి జిల్లా కైలాసలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని ఓ అనాథాశ్రమంలో సమోసాలు తిని శనివారంనాడు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇవాళ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.చనిపోయిన వారిలో భవాని, శ్రద్ధ, జాషువా ఉన్నారు. మరో 24 మందికి అనకాపల్లి, నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు డీఈవో అప్పారావు తెలిపారు.అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ పరామర్శించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టింది.శనివారం రాత్రి హాస్టల్ నిర్వాహకుడు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత వారికి సమోసాలు, చాక్లెట్లను హాస్టల్‌ నిర్వాహకులు పంచిపెట్టారు. 

శనివారం రాత్రి భోజనంలో సాంబారుతో పిల్లలకు భోజనం పెట్టారు. శనివారం రాత్రి నుంచి చిన్ానరులు వాంతలు, విరోచనాలతో బాధపడటంతో హాస్టల్‌ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లల్ని ఇళ్లకు తీసుకు వెళ్లాలని చెప్పడంతో పిల్లల్ని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళ్లిపోయారు. నర్సీపట్నం ఏరియాలోని కుల్లూరు, చింతపల్లి ఏజెన్సీ గ్రామాలకు చెందిన వారు హాస్టల్లో ఆశ్రయం పొందతున్నారు.ఆదివారం చికిత్స పొందుతూ చింతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, కుల్లూరుకు చెందిన మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. కిరణ్‌ కుమార్‌ అనే వ్యక్తి స్థానికంగా చర్చితో పాటు ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దాతలు ఇచ్చిన ఆహారపదార్ధాలను చిన్నారులకు అందించినట్టు తెలుస్తోంది. కలుషిత ఆహార పదార్ధాలను భుజించిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న వారిలో పలువురు చిన్నారుల్ని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>