Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/alert-news56766bc0-d1f3-4483-b763-b0f2f615cbee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/alert-news56766bc0-d1f3-4483-b763-b0f2f615cbee-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఫోన్‌ ద్వారానే డబ్బు చెల్లించడం లేదంటే రిసీవ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. 'యూపీఐ' అనే సింపుల్‌ పేమెంట్ మెథడ్ భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫోన్‌ కెమెరా ద్వారా కోడ్ క్యాప్చర్ చేయడం లేదా కొన్ని అంకెలను (UPI ID) ఇచ్చి క్లిక్ చేస్తే చాలు, డబ్బు మరొకరికి చేరుతుంది. అయితే ఈ యూపీఐని కొంతమంది మోసగాళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు యూజర్ ఫోన్‌లో మెసేజ్ పంపి, లేదా యాప్‌లో నోటిఫికేషన్ చూపించి, "పే మనీ" అని రిక్వెస్ట్ పంపిస్తున్నారు, అది ఒక నెట్‌ఫ్లిక్స్‌ లేదంటే ఇతర alert news{#}Bank;Application;Government;Smart phoneమొబైల్ ఫోన్‌కు ఈ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా.. బ్యాంకు ఖాతా ఖాళీ..?మొబైల్ ఫోన్‌కు ఈ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా.. బ్యాంకు ఖాతా ఖాళీ..?alert news{#}Bank;Application;Government;Smart phoneMon, 19 Aug 2024 19:19:00 GMT
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఫోన్‌ ద్వారానే డబ్బు చెల్లించడం లేదంటే రిసీవ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. 'యూపీఐ' అనే సింపుల్‌ పేమెంట్ మెథడ్ భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫోన్‌ కెమెరా ద్వారా కోడ్ క్యాప్చర్ చేయడం లేదా కొన్ని అంకెలను (UPI ID) ఇచ్చి క్లిక్ చేస్తే చాలు, డబ్బు మరొకరికి చేరుతుంది. అయితే ఈ యూపీఐని కొంతమంది మోసగాళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు యూజర్ ఫోన్‌లో మెసేజ్ పంపి, లేదా యాప్‌లో నోటిఫికేషన్ చూపించి, "పే మనీ" అని రిక్వెస్ట్ పంపిస్తున్నారు, అది ఒక నెట్‌ఫ్లిక్స్‌ లేదంటే ఇతర సామాన్య సబ్‌స్క్రిప్షన్ లాగానే కనిపిస్తుంది.

 వాళ్లు పంపించే నోటిఫికేషన్ కింద బటన్ క్లిక్ చేయమని అంటారు. తెలియక క్లిక్ చేస్తే... మీ ఖాతా నుంచి డబ్బు వాళ్ళ ఖాతాకు వెళ్లిపోతుంది. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ యాక్సెస్ చేయవచ్చని చెప్పి, యూపీఐ ఆటోపే కోసం అడిగితే జాగ్రత్త పడాలి. దానిపై క్లిక్ చేసి ఏం పేమెంట్ చేయాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. అది నిజంగా మీ నెట్‌ఫ్లిక్స్ అప్లికేషన్ పంపించిన మెసేజ్  కాకపోవచ్చు. మోసగాళ్లు మీ పేరుతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని, మీ డబ్బుతో వాళ్ళు సినిమాలు చూస్తున్నట్లు ఉండొచ్చు.

ఎలా జరుగుతుంది ఈ మోసం?

యూపీఐ ఐడీ గుర్తించడం చాలా సులభం. మీ ఫోన్ నంబర్‌కు ఒక చిన్న అదనపు సంఖ్య జోడించితే అది మీ యూపీఐ ఐడీ అవుతుంది. ఈ ఫోన్ నంబర్లు ఎక్కడో ఒకచోట లీక్ అయితే, మోసగాళ్లు మీ యూపీఐ ఐడీని సులభంగా గుర్తించి మీ పేరుతో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నీకు నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా కనిపించే మెసేజ్‌లు వస్తాయి. అందులో మీ పేరు, మీ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌లో ఉన్న కొన్ని వివరాలు కూడా ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల అది నిజమే అనుకుంటారు. ఈ మోసగాళ్ళు ఎక్కువ సమయం ఇవ్వరు. వెంటనే డబ్బు పంపించమని అంటారు. ఆలోచించే లోపే డబ్బు పంపించేలాగా ఒత్తిడి చేస్తారు.

 సీనియర్ సిటిజన్లు ఈ మోసగాళ్ల బారిన పడే అవకాశం ఎక్కువ కాబట్టి వారు తమ బ్యాంక్ అకౌంట్స్ ను డైరెక్టుగా యూపీఐ ఐడికి లింకు చేయకూడదు. ఒక వాలెట్ ఉపయోగించాలి అందులో కూడా చాలా తక్కువ డబ్బులు ఉంచాలి. ఏదైనా అనుమానం వేస్తే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసి అడ్వైస్ అడగాలి. యూపీఐ పాస్‌వర్డ్ నొక్కకూడదు తెలిసిన వాళ్ళని పిలిచి ఈ పని చేయొచ్చా లేదా అని అడగాలి. డిజిటల్ పేమెంట్స్ గురించి తెలిసిన వాళ్లు కూడా జాగ్రత్త పడాలి. ఫోన్లో నోటిఫికేషన్ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి పేమెంట్స్ చేయరాదు బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వరాదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>