PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kapud3e0f810-48c2-46b6-8033-0a69816021fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kapud3e0f810-48c2-46b6-8033-0a69816021fa-415x250-IndiaHerald.jpgఏపీలో కాపులు ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంలో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక చంద్ర‌బాబు 2014లో ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు కాపుల కోసం ప్ర‌త్యేకంగా కాపు కార్పొరేష‌న్ తీసుకు వ‌చ్చారు. అప్పుడు ఈ కాపు కార్పొరేష‌న్‌కు మాజీ మంత్రి.. సీనియ‌ర్ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుకు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిపోయారు. ఇదంతా గ‌తం.. ఇక ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారం లోకి రావ‌డంతో పాటు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ దామాషా ప‌ద్ద‌తిలో ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ap kapu{#}prasanna;ramakrishna;MP;TDP;Minister;Party;CBN;India;Reddyఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆ నేత‌కు ఫిక్స్ చేశారా ?ఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆ నేత‌కు ఫిక్స్ చేశారా ?ap kapu{#}prasanna;ramakrishna;MP;TDP;Minister;Party;CBN;India;ReddyMon, 19 Aug 2024 13:59:55 GMTఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆ నేత‌కు ఫిక్స్ చేశారా ?
- టీడీపీ తో పాటు జ‌న‌సేన నాయ‌కులు కూడా ఆస‌క్తి .. ?
- బాబు  - ప‌వ‌న్ స్పెష‌ల్ కాన్ సంట్రేష‌న్‌
- రేసులో ఆకుల రామ‌కృష్ణ .. ?

- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .

ఏపీలో కాపులు ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంలో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక చంద్ర‌బాబు 2014లో ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు కాపుల కోసం ప్ర‌త్యేకంగా కాపు కార్పొరేష‌న్ తీసుకు వ‌చ్చారు. అప్పుడు ఈ కాపు కార్పొరేష‌న్‌కు మాజీ మంత్రి.. సీనియ‌ర్ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుకు చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిపోయారు. ఇదంతా గ‌తం.. ఇక ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారం లోకి రావ‌డంతో పాటు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ దామాషా ప‌ద్ద‌తిలో ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.


అయితే ఇప్పుడు కీల‌క‌మైన కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం చాలా మంది పోటీ ప‌డుతున్నారు.  ఎవరికి వారు తమకున్న పరిచయాలతో పార్టీ అగ్ర నేతలను ప్రసన్న చేసుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. ఈ ప‌ద‌వి కోసం టీడీపీ లోనే చాలా పోటీ ఉంది అనుకుంటే.. అటు జ‌న‌సేన‌కు చెందిన కాపు నేత‌లు కూడా పోటీ ప‌డుతున్నారు. ప‌వ‌న్ ద్వారా ఈ ప‌ద‌వి మ‌న పార్టీకే ఉండాలంటూ లాబీయింగ్ చేస్తున్నారు.


ఈ ప‌ద‌వి కోస్తాంధ్ర జిల్లాల‌కు చెందిన నాయ‌కుడికి ఇవ్వాల‌ని ఈ ప్రాంతానికి చెందిన వారు గ‌ట్టి గా ప‌ట్టుబ‌డుతున్నారు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నా.. ప్ర‌ధానంగా ఆకుల రామకృష్ణ పేరు తొలి వ‌రుస‌లో ఉంద‌ని తెలిసింది. ఈయ‌న మాజీ స్పీకర్ బాలయోగికి ముఖ్య అనుచ‌రుడుగా ఉండేవారు. ఆకుల‌కు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌, రాష్ట్ర మంత్రి సుభాష్, రెడ్డి సుబ్రమణ్యం, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్పలు ఆశీస్సులు మెండుగా ఉండ‌డంతో ఆయ‌న వైపే మొగ్గు చూపుతారా ? అన్న చ‌ర్చ న‌డుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>