MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-gruhalakshmi-thyagarajan-prashanth-second-marraige-kollywood-andhagan72a9692b-d82d-48f9-a777-d4591d38c5d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-gruhalakshmi-thyagarajan-prashanth-second-marraige-kollywood-andhagan72a9692b-d82d-48f9-a777-d4591d38c5d5-415x250-IndiaHerald.jpgఏంటి.. ఆ హీరో 50 ఏళ్లు పై పడ్డాక రెండో పెళ్లి చేసుకుంటున్నారా.. నిజంగానే ఆ హీరో రెండో పెళ్లికి సిద్ధమయ్యారా ..ఆ హీరో తండ్రి చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా సెలబ్రిటీలు చాలామంది మొదటి బంధం సెట్ అవ్వకపోతే డివోర్స్ తీసుకొని రెండో పెళ్లి, మూడో పెళ్లి,నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.. అయితే తాజాగా వారి బాటలోనే ఓ స్టార్ హీరో కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఆ హీరో ఎవరో కాదు సౌత్ స్టార్ హీరో ప్రశాంత్.. ఇక ఈ హీరో పేరు ఇప్పటి జనరేషన్ కి కూడా సూపరిచితమే. ఈయన నPRASHANTH; GRUHALAKSHMI; THYAGARAJAN; PRASHANTH SECOND MARRAIGE; KOLLYWOOD; ANDHAGAN{#}prasanth;thyagarajan;marriage;Good news;Vinaya Vidheya Rama;Father;Nijam;Good Newwz;Prashant Kishor;Raccha;Hindi;Girl;Director;Cinema;Hero;Telugu;Tamil50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..?50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..?PRASHANTH; GRUHALAKSHMI; THYAGARAJAN; PRASHANTH SECOND MARRAIGE; KOLLYWOOD; ANDHAGAN{#}prasanth;thyagarajan;marriage;Good news;Vinaya Vidheya Rama;Father;Nijam;Good Newwz;Prashant Kishor;Raccha;Hindi;Girl;Director;Cinema;Hero;Telugu;TamilMon, 19 Aug 2024 11:19:00 GMTఏంటి.. ఆ హీరో 50 ఏళ్లు పై పడ్డాక రెండో పెళ్లి చేసుకుంటున్నారా.. నిజంగానే ఆ హీరో రెండో పెళ్లికి సిద్ధమయ్యారా ..ఆ హీరో తండ్రి చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా సెలబ్రిటీలు చాలామంది మొదటి బంధం సెట్ అవ్వకపోతే డివోర్స్ తీసుకొని రెండో పెళ్లి, మూడో పెళ్లి,నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.. అయితే తాజాగా వారి బాటలోనే ఓ స్టార్ హీరో కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఆ హీరో ఎవరో కాదు సౌత్ స్టార్ హీరో ప్రశాంత్.. ఇక ఈ హీరో పేరు ఇప్పటి జనరేషన్ కి కూడా సూపరిచితమే. ఈయన నటించిన జీన్స్ సినిమా ఇప్పటికి ఎంతోమంది సినీ ప్రియులని ఆకట్టుకుంటుంది. అయితే ఈయన నటించిన జీన్స్, ప్రేమకావ్యం, జోడి, తొలిముద్దు వంటి సినిమాలు చేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యారు.కానీ ఎక్కువ సినిమాలు మాత్రం  తమిళంలోనే చేశారు. 

అలాగే హిందీ భాషలో కూడా ప్రశాంత్ నటించారు.ఇక ప్రశాంత్ రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ మూవీలో చరణ్ కి అన్నయ్యగా చేశారు.అయితే ప్రశాంత్ ఎవరో కాదు ప్రముఖ తమిళ్ డైరెక్టర్ త్యాగరాజన్ తనయుడు. అయితే తాజాగా ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన తండ్రి అఫీషియల్ గా బయటపెట్టారు.. ప్రశాంత్ నటించిన అంధగాన్ అనే సినిమా ఈవెంట్లో డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. ప్రశాంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఆయన కోసం అమ్మాయిని వెతికే పనిలో పడ్డాం.. అమ్మాయి దొరకడంతోనే ఆ గుడ్ న్యూస్ మీకు త్వరలోనే చెబుతాం అంటూ డైరెక్టర్ త్యాగరాజన్ చెప్పారు. ఇక ప్రశాంత్ మొదట్లో గృహలక్ష్మి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు..

కానీ ఇక విచిత్రం ఏమిటంటే.. గృహలక్ష్మికి అంతకుముందే మరో వ్యక్తితో పెళ్లయింది. కానీ ఈ విషయాన్ని ప్రశాంత్ కి ప్రశాంత్ కుటుంబానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఇక వీరికి పెళ్ళై ఓ కొడుకు పుట్టాక ఈ విషయం బయట పడడంతో అప్పట్లో వీరి ఫ్యామిలీలో చాలా రచ్చ రచ్చ జరిగిందట. దాంతో గృహలక్ష్మికి విడాకులు ఇవ్వాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో ప్రశాంత్ కూడా గృహలక్ష్మికి విడాకులు ఇచ్చాడు. ఇక వీరికి 2005లో పెళ్లి అయితే 2009లోనే విడాకులు తీసుకున్నారు. అలా వీరి బంధం నాలుగు సంవత్సరాలు కూడా నిలవలేదు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ ప్రశాంత్ ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉన్నాడు. కానీ 51 ఏళ్ల వయసులో ప్రశాంత్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>