PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. అక్కడ టీడీపీ కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన వారెందరో ఉన్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, ఎన్నారైలు కూడా టీడీపీ కోసం పనిచేశారు. అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో 30% జనసేనకు, 10 శాతం బీజేపీ వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫుడ్ కKommareddy {#}Telugu Desam Party;CM;Degree;Assembly;Director;YCP;Nijam;Party;CBN;Bharatiya Janata Party;TDP;Indiaఏపీ నామినేటెడ్ వార్: థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ కూడా సహించిన కొమ్మారెడ్డికి ఫలితం దక్కేనా..?ఏపీ నామినేటెడ్ వార్: థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ కూడా సహించిన కొమ్మారెడ్డికి ఫలితం దక్కేనా..?Kommareddy {#}Telugu Desam Party;CM;Degree;Assembly;Director;YCP;Nijam;Party;CBN;Bharatiya Janata Party;TDP;IndiaMon, 19 Aug 2024 08:01:00 GMT* ఏపీలో నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు బాబు రెడీ  

* ప్రముఖంగా వినిపిస్తున్న కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ పేరు

* ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కేనా  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు. అక్కడ టీడీపీ కోసం తమ జీవితాలను త్యాగాలు చేసిన వారెందరో ఉన్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు, ఎన్నారైలు కూడా టీడీపీ కోసం పనిచేశారు. అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో 30% జనసేనకు, 10 శాతం బీజేపీ వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫుడ్ కమిషన్ ఛైర్మన్‌గా కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ ని నియమించే అవకాశం ఉందని లేటెస్ట్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఆయనకు పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన వైసీపీ విధానాలను ఎండగట్టారు. ఈ కారణంగా వైసీపీ జైలుకు పంపినా, థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా ఆయన ఏ మాత్రం భయపడలేదు. టీడీపీ గెలుపు కోసమే అన్నీ భరించారు. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో వందల సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి రెండు నెలలు చంద్రబాబు వాటిని ఇంకా భర్తీ చేయలేదు. ఎట్టకేలకు ఈ పదవులను భర్తీ చేస్తానని ఆయన ప్రకటించడంతో టీడీపీ కోసం ఎంతో త్యాగాలు చేసిన వారు సంతోషపడిపోతున్నారు.

కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్‌ టీడీపీ కోసం థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ కూడా భరించారు. టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 161 సీట్లతో విజయం సాధించిన తర్వాత ఆయన అందరికంటే ఎక్కువగా సంబరాలు చేసుకున్నారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటానని కూడా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం ఎంత చేసిన ఆయనకు తప్పనిసరిగా నామినేటెడ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేతలకు మంచి పదవులు ఇస్తే వారు మరింత లాయల్ గా మారుతారు. అది పార్టీకి ఎంతో మేలు చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>