TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/actress-naveena-yata-telugu-comments5cc51402-288d-4054-8770-2f5536eace6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/actress-naveena-yata-telugu-comments5cc51402-288d-4054-8770-2f5536eace6e-415x250-IndiaHerald.jpgప్రముఖ బుల్లితెర నటి, నిర్మాత యాట నవీన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సీరియల్స్ తో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కొడుకులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ తెగ హడావిడి చేస్తోంది. ఇక ఈమె భర్త ఎవరో కాదు యాట సత్యనారాయణ. ఇటీవల రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాట నవీన అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ కోల్పోయామంటూ చెప్పుకొచ్చింది. నవీన మాట్లాడుతూ.. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంతోACTRESS NAVEENA YATA;TELUGU;COMMENTS{#}gummadi;naveena;Director;Husband;gold;marriage;producer;Producerటీవీ: అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ కోల్పోయాం.. బుల్లితెర నటి సంచలన కామెంట్స్..!టీవీ: అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ కోల్పోయాం.. బుల్లితెర నటి సంచలన కామెంట్స్..!ACTRESS NAVEENA YATA;TELUGU;COMMENTS{#}gummadi;naveena;Director;Husband;gold;marriage;producer;ProducerMon, 19 Aug 2024 02:00:00 GMTప్రముఖ బుల్లితెర నటి, నిర్మాత యాట నవీన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సీరియల్స్ తో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కొడుకులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ తెగ హడావిడి చేస్తోంది. ఇక ఈమె భర్త ఎవరో కాదు యాట సత్యనారాయణ. ఇటీవల రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాట నవీన అప్పులు తీర్చడానికి ఆస్తులన్నీ కోల్పోయామంటూ చెప్పుకొచ్చింది.


నవీన మాట్లాడుతూ.. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది.  నా చిన్నప్పటి నుంచి మా అమ్మ చీరలు అమ్ముతూ, మిషన్ కుడుతూ వచ్చిన డబ్బుతో మమ్మల్ని చదివించింది. నేను షూటింగ్ కి వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంటుంది. నిజానికి నేను నటన రంగంలోకి ఇష్టంగా రాలేదు. డబ్బుకోసమే వచ్చాను. అప్పట్లో సినిమాలలో అవకాశాలు రావాలంటే ఫోటోషూట్స్ చేయించుకొని మరి అవి పట్టుకొని తిరిగే వాళ్ళం.  అందుకోసం మా అమ్మ దగ్గర ఉన్న ఒకే ఒక బంగారు నగ  కూడా అమ్మేసి,  నాకు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీయించింది.ఇక నేను కాదంటే అవుననిలే,  వీరి వీరి గుమ్మడి పండు వంటి సినిమాలలో హీరోయిన్గా చేశాను .ఇంకో రెండు సినిమాలలో కూడా చేశాను. కానీ అవి విడుదల కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు నాకు నటన సరిగా రాదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్ లోనే అరిచేవాడు. ఒకరోజు గట్టిగా అరవడంతో ఏడ్చి వెళ్లిపోయాను. ఆ తర్వాత మా మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాము.

ఒక సీరియల్ చేయడానికి మేము దాదాపు రూ.70 లక్షల వరకు ఖర్చు చేసాము. అయితే అగ్రిమెంట్ దగ్గర తేడా రావడంతో 100 ఎపిసోడ్లకి సీరియల్ ఆపేయడం జరిగింది. దాంతో రూ.20 లక్షలు వెనక్కి వచ్చాయి. కానీ రూ 50 లక్షలు నష్టం తీర్చడానికి మా దగ్గర ఉన్న భూమి కూడా అమ్మేసి అప్పులు తీర్చాము. నాకు నా దగ్గర ఒక కిలో బంగారం ఉండాలనేది నా కల.   టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ బంగారాన్ని కొనుగోలు చేశాను అంటూ చెప్పుకొచ్చింది నవీన.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>