PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gowthu-shirisha7dac1ddc-106e-43d7-ad65-cab647e4fe3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gowthu-shirisha7dac1ddc-106e-43d7-ad65-cab647e4fe3a-415x250-IndiaHerald.jpgపొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ప్రేమ వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో మంది మహిళ నేతలు ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. అందులో చాలా మంది ప్రేమ వివాహాన్ని చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం అద్భుతమైన సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్న రాజకీయ మహిళా నేతలలో గౌతు శిరీష ఒకరు. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి తెలుగు దేశం నేత. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్gowthu shirisha{#}vijayalakshmi;Hanu Raghavapudi;Srikakulam;Sri Venkateswara swamy;University;Interview;Chatrapathi Shivaji;Sivaji;Telugu Desam Party;prema;Love;marriage;Telugu;Andhra Pradeshపొలిటికల్ క్వీన్ లు ... ప్రేమ వివాహాలు : గౌత శిరీష ప్రేమ వివాహం వెనుక ఎన్ని మలుపులో తెలుసా..?పొలిటికల్ క్వీన్ లు ... ప్రేమ వివాహాలు : గౌత శిరీష ప్రేమ వివాహం వెనుక ఎన్ని మలుపులో తెలుసా..?gowthu shirisha{#}vijayalakshmi;Hanu Raghavapudi;Srikakulam;Sri Venkateswara swamy;University;Interview;Chatrapathi Shivaji;Sivaji;Telugu Desam Party;prema;Love;marriage;Telugu;Andhra PradeshSun, 18 Aug 2024 09:03:00 GMTపొలిటికల్ లీడర్స్ ఎంతో మంది ప్రేమ వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో మంది మహిళ నేతలు ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. అందులో చాలా మంది ప్రేమ వివాహాన్ని చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలా ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం అద్భుతమైన సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్న రాజకీయ మహిళా నేతలలో గౌతు శిరీష ఒకరు.

ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గానికి తెలుగు దేశం నేత. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలిగా ఈమె పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట నాయకుడైనా సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు ఈ గౌతు శిరీష. గౌతు శిరీష ... గౌతు శ్యాం సుందర్ శివాజీ , విజయలక్ష్మి దంపతులకు జన్మించింది.

ఈమె 1996 వ సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని అడ్మినిస్ట్రేషన్ పైడా కాలేజ్ లో MBA (మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేసింది. అంతేకాకుండా 2015 లో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోనే NBM లా కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసింది. ఈమె 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో తెలుగు దేశం తరఫున పోటీ చేసి విజయం సాధించింది.

ఇకపోతే తాజాగా శిరీష ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన ప్రేమ గురించి తన ప్రేమ సక్సెస్ కావడానికి ముందు జరిగిన పరిణామాల గురించి తెలియజేసింది. శిరీష మాట్లాడుతూ ... నేను ఎంబీఏ చదువుతున్న రోజులలో నా క్లాస్మేట్ అయినటువంటి వెంకన్న చౌదరిని ప్రేమించాను.

ఆ తర్వాత అతనికి ప్రపోజ్ చేశాను. ఆయన కూడా నా ప్రేమను అంగీకరించాడు. ఆ తర్వాత మేమిద్దరం ప్రేమించుకున్నాక మా ఇంట్లో చెప్పాము. మొదట వద్దు అన్న కూడా నన్ను కాలేజీకి పంపించడం ఉండడం కానీ ... ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా ఉండడం కానీ జరగలేదు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారు.

మా పెళ్లి జరిగింది. ఇప్పటికి కూడా మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం అని శిరీష తాజా ఇంటర్వ్యూ లో బాగంగా తెలియజేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>