PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy-upset-with-tollywood-bigwigs12df3b01-dc27-4561-9c24-9aca1795deb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy-upset-with-tollywood-bigwigs12df3b01-dc27-4561-9c24-9aca1795deb1-415x250-IndiaHerald.jpg ఆ తర్వాత డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే క్యాబినెట్ విస్తరణతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు నియమకం తదితర అంశాల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగింది. కానీ రేవంత్ ఢిల్లీ చేరుకున్న తర్వాత అదే రోజు వెనక్కి తిరిగి వచ్చేసారు. revanth reddy{#}Cabinet;Telangana Chief Minister;revanth;Revanth Reddy;Telangana;MLA;Minister;Congressతెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో అదిరిపోయే ట్విస్ట్‌.. రేవంత్ ఏంటీ షాక్‌..?తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో అదిరిపోయే ట్విస్ట్‌.. రేవంత్ ఏంటీ షాక్‌..?revanth reddy{#}Cabinet;Telangana Chief Minister;revanth;Revanth Reddy;Telangana;MLA;Minister;CongressSun, 18 Aug 2024 14:51:13 GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు - సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం - రైతు రుణమాఫీ సభల‌తో ఆయన బిజీబిజీగా గడిపారు. ఆ తర్వాత డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే క్యాబినెట్ విస్తరణతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు నియమకం తదితర అంశాల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగింది. కానీ రేవంత్ ఢిల్లీ చేరుకున్న తర్వాత అదే రోజు వెనక్కి తిరిగి వచ్చేసారు.


రేవంత్ ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖ‌ర్గేను మాత్రమే కలుసుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడ అందుబాటులో లేరు.. సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో రేవంత్ ను కలవలేకపోయారు. దీంతో రేవంత్  వెళ్ళిన రోజే వెనుక రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ? ఉంటుందని ఆశావాహులు అందరూ ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. అందులో హోమ్ శాఖ - విద్యాశాఖ వంటి వాటికి మంత్రులు లేకపోవడంతో రేవంత్ సర్కార్ పై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికి తనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు.


అలాగే మాదిగలు కూడా తమ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికి రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి ఖాయం అయిందని అంటున్నారు. ఇక మిగతా శాఖలో ఎవరెవరికి బాధ్యతలు అప్పగిస్తారు దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా సీనియర్ నేతలు తమ లాబీయింగ్‌ అయితే మొదలుపెట్టేశారు. ఏది ఏమైనా తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రుల ఎంపిక ... తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం పూర్తయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు గొడవలు తప్పేలా లేవు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>