MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-is-like-joker-in-kalki-arshad-warsi1726038f-bbf0-4b3e-84f7-ea8d2cfa0ba3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-is-like-joker-in-kalki-arshad-warsi1726038f-bbf0-4b3e-84f7-ea8d2cfa0ba3-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. ఆరడగులకు పైగా ఉండే కటౌట్ చూసి ఎవరైనా ఇట్టే మూర్ఛపోతారు. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో కూడా కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ మొదటిస్థానంలో ఉంటారు. బాహుబలి సినిమాకు ముందు చేసిన మిర్చి సినిమాలో ఎంత అందంగా కనపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న గ్లామర్ తో అమ్మాయిల మనసును దోచేశాడు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మాత్రం ప్రభాస్ కనపడిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. tollywood{#}maruti;naga;Bahubali;Mirchi;Joker;Pooja Hegde;Athadu;Prabhas;deepika;vijay kumar naidu;Amitabh Bachchan;Telugu;bollywood;Chitram;Cinema;Hanu Raghavapudi;Indiaకల్కిలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. అర్షద్ వార్సి..!?కల్కిలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. అర్షద్ వార్సి..!?tollywood{#}maruti;naga;Bahubali;Mirchi;Joker;Pooja Hegde;Athadu;Prabhas;deepika;vijay kumar naidu;Amitabh Bachchan;Telugu;bollywood;Chitram;Cinema;Hanu Raghavapudi;IndiaSun, 18 Aug 2024 16:35:00 GMTపాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. ఆరడగులకు పైగా ఉండే కటౌట్ చూసి ఎవరైనా ఇట్టే మూర్ఛపోతారు. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా తమిళం, కన్నడం, మళయాళం, హిందీలో కూడా కటౌట్ ఉన్న హీరోల్లో ప్రభాస్ మొదటిస్థానంలో ఉంటారు. బాహుబలి సినిమాకు ముందు చేసిన మిర్చి సినిమాలో ఎంత అందంగా కనపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న గ్లామర్ తో అమ్మాయిల మనసును దోచేశాడు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మాత్రం ప్రభాస్ కనపడిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం

 మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన తర్వాత అందరూ ప్రభాస్ ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నారు. మరోవైపు ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది.  

కల్కి సినిమాలో ప్రభాస్ నటనపై  బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి  సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో అర్షద్‌ మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమా తనకు నచ్చలేదని తెలిపాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అసలే అర్థం కాడు. ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు. ఆయనకు ఉన్న పవర్‌లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది. అతడు అసాధారణమైన వ్యక్తి. నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తాడు అంటూ అర్షద్ చెప్పుకోచ్చాడు. అయితే అర్షద్ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>