MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies52b8a723-b2b6-422c-a114-eefdb24d1783-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/movies52b8a723-b2b6-422c-a114-eefdb24d1783-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమలో అనేక పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే దాదాపుగా స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు అంటే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇక కొన్ని పాన్ ఇండియా మూవీ లకు ముందు విడుదల తేదీలను ప్రకటించడం , ఆ తర్వాత అనుకోని కారణాలవల్ల అవి పోస్ట్ పోన్ కావడంతో ఆ తేదీల్లో వేరే సినిమాలు రావడం ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. కానీ అలా పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల్లో రీసెంట్ టైమ్ లో వచ్చిన చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దmovies{#}Jr NTR;ram pothineni;september;India;Prabhas;Mister;Box office;Telugu;Cinemaపాన్ ఇండియా మూవీస్ డేట్లను భర్తీ.. కానీ నో యూస్..?పాన్ ఇండియా మూవీస్ డేట్లను భర్తీ.. కానీ నో యూస్..?movies{#}Jr NTR;ram pothineni;september;India;Prabhas;Mister;Box office;Telugu;CinemaSun, 18 Aug 2024 22:09:00 GMTఈ మధ్య కాలంలో మన తెలుగు సినీ పరిశ్రమలో అనేక పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే దాదాపుగా స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు అంటే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇక కొన్ని పాన్ ఇండియా మూవీ లకు ముందు విడుదల తేదీలను ప్రకటించడం , ఆ తర్వాత అనుకోని కారణాలవల్ల అవి పోస్ట్ పోన్ కావడంతో ఆ తేదీల్లో వేరే సినిమాలు రావడం ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. కానీ అలా పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీల్లో రీసెంట్ టైమ్ లో వచ్చిన చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. పోయిన సంవత్సరం ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దానితో రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద అనే మూవీ అదే తేదీన విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరోత్సాహ పరిచింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీ ని మొదట ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ కావడంతో అదే తేదీన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ కావడంతో అదే తేదీన డబల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు మూవీ లకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇలా పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీలలో వచ్చిన క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య కాలంలో బోల్తా కొట్టాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>