Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara8e389695-e8c8-406a-ae89-a2aed424c111-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara8e389695-e8c8-406a-ae89-a2aed424c111-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'దేవర' మూవీ devara{#}Janhvi Kapoor;Saif Ali Khan;Shiva;koratala siva;lord siva;NTR;Music;Chitram;Director;Tollywood;september;News;Cinema;Jr NTR;Indiaఒక రోజు ముందుగానే 'దేవర' రిలీజ్.. ఎక్కడంటే..?ఒక రోజు ముందుగానే 'దేవర' రిలీజ్.. ఎక్కడంటే..?devara{#}Janhvi Kapoor;Saif Ali Khan;Shiva;koratala siva;lord siva;NTR;Music;Chitram;Director;Tollywood;september;News;Cinema;Jr NTR;IndiaSun, 18 Aug 2024 15:39:45 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇక ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'దేవర' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ప్రమోషనల్ కంటెంట్ ను తారక్ ఫ్యాన్స్ కు, సినీ లవర్స్ కు అందించడంలో మాత్రం కొరటాల ప్లానింగ్, విజన్ అద్భుతమనే చెప్పాలి. ఈ స్టార్ డైరెక్టర్ అప్డేట్స్ ఇవ్వడంలో ముందు నుంచి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. పైగా దేవర నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్, కంటెంట్ ఆడియెన్స్ లోకి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దేవర ఫియర్ సాంగ్, గ్లింప్ల్స్, చుట్టమల్లే సాంగ్, ఆయుధ పూజ పిక్ తాజాగా వదిలిన సైఫ్ అలీ ఖాన్ 'భైరా' ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి.

ఇక అభిమానుల్లో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా? అన్న క్యూరియాసిటీని రేకెత్తించింది. అప్డేట్ కు అప్డేట్ కు మధ్య ఎక్కువ గ్యాప్ ఇస్తే.. ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎక్కడ డివియేట్ అవుతారో అని ముందుగానే తన విజన్ తో పసిగట్టిన కొరటాల అందుకు తగ్గట్లుగానే మాసీవ్ అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులకు కిక్కిస్తున్నాడు. పైగా దేవరలో ఇంకా ఇవ్వాల్సిన అప్డేట్స్ చాలా ఉన్నాయి. వాటి విషయంలో కొరటాల ఎలా ప్లాన్ చేశాడో అని ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. దాంతో ప్రమోషనల్ కంటెంట్, అప్డేట్స్ విషయంలో కొరటాల శివ ప్లానింగ్, విజన్ కు 'దేవర' ఓ సాక్ష్యంగా నిలుస్తోందని సినీ విశ్లేషకులతో పాటుగా మూవీ లవర్స్ చెప్పుకొస్తున్నారు.దేవర సినిమాకు జాన్వీ కపూర్ గ్లామర్ హైలెట్ గా నిలవనుందని భోగట్టా.దేవర1, దేవర2 పాన్ ఇండియా హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకింత ఎక్కువ నిడివితోనే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దేవర టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా 26వ తేదీన యూఎస్ఏ లో ప్రీమియర్లు వేయనున్నారు.ఈ విషయాన్ని మూవీ టీం తాజాగా ప్రకటించింది. ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీ ని యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నాయి.దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్  తన అందంతోఆకట్టుకోబోతుంది.ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>