MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-harish-shankard69f103d-3d17-454a-8b92-58471cd26517-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-harish-shankard69f103d-3d17-454a-8b92-58471cd26517-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ హీరో హీరోయిన్లుగా నటించిన "మిస్టర్ బచ్చన్" సినిమా ప్రీమియర్స్‌లోనే ఫ్లాప్ అయింది. ఈ సినిమాని సోషల్ మీడియాలో చాలా మంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్‌ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా హీరో రవితేజ ప్రమోషన్లకు రాని కారణంగా, దర్శకుడు హరీష్ శంకర్‌ ఒక్కరే సినిమా ప్రమోషన్స్‌ చేశారు. కానీ, ఆయన సినిమా కంటే తన గురించే ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. దీని వల్ల సినిమాపై ప్రేక్షకుల ఆసకHarish Shankar{#}Ravi;Bhagyashree;ravi teja;Ishtam;harish shankar;media;Darsakudu;shankar;Heroine;Hero;Cinema;Directorమీడియాతో పెట్టుకుంటే నాశనమే.. హరీష్ శంకర్ కి వణుకు పుట్టిస్తున్నారుగా..??మీడియాతో పెట్టుకుంటే నాశనమే.. హరీష్ శంకర్ కి వణుకు పుట్టిస్తున్నారుగా..??Harish Shankar{#}Ravi;Bhagyashree;ravi teja;Ishtam;harish shankar;media;Darsakudu;shankar;Heroine;Hero;Cinema;DirectorSun, 18 Aug 2024 12:30:00 GMTమాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ హీరో హీరోయిన్లుగా నటించిన "మిస్టర్ బచ్చన్" సినిమా ప్రీమియర్స్‌లోనే ఫ్లాప్ అయింది. ఈ సినిమాని సోషల్ మీడియాలో చాలా మంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీష్ శంకర్‌ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా హీరో రవితేజ ప్రమోషన్లకు రాని కారణంగా, దర్శకుడు హరీష్ శంకర్‌ ఒక్కరే సినిమా ప్రమోషన్స్‌ చేశారు. కానీ, ఆయన సినిమా కంటే తన గురించే ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. దీని వల్ల సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిందని చెప్పవచ్చు.

మూవీ గురించి మాట్లాడే బదులు, మీడియా వాళ్లతో గొడవలు పెట్టుకున్నాడు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి వివాదాల జోలికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. అదే అతని కొంపముంచిందని చాలామంది అంటున్నారు. మీడియా వాళ్ళు కూడా ఈ సినిమాని బాగా టార్గెట్ చేశారు. ఇందులోని మైనస్‌లను హైలెట్ చేసి చూపించారు.

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో కూడా అనవసరమైన గొడవల్లో వేలు పెట్టాడు. సినిమా నిర్మాతలు, హీరో ఈ విషయంలో మౌనంగా ఉండిపోయారు. అసలు సినిమా గురించి మాట్లాడకుండా, అనవసరమైన విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ నెగిటివిటీ పెంచుకున్నారు. సినిమాలో హీరోయిన్‌ను పట్టుకోరాని చోట హీరో చేత పట్టించాడు. పాటల్లో డ్యాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌ దగ్గర హీరో చేత పట్టించి ఆడవాళ్ల మనోభావాలను దెబ్బతీశాడు, పాత జోకులు వాడడం, అనవసరమైన ప్రేమకథలు పెట్టడం లాంటివి చేశాడు. మంచి కథ ఉన్న సినిమాను అధికంగా కమర్షియలైజ్ చేసి నాశనం చేశాడు.

హరీష్ శంకర్ "మిస్టర్ బచ్చన్" సినిమాని మెరుగుపరచడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలను తొలగించినా, సినిమా ప్రమోషన్ల సమయంలో తన గురించే ఎక్కువ ప్రచారం చేసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా, తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ ఫ్లాప్ తో తనకి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. హరీష్ శంకర్‌పై వచ్చిన విమర్శలు ఏ దర్శకుడు పైన రాలేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఆయన తన గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోవడమే. ఇప్పుడైనా హరీష్ శంకర్ తన తప్పును గ్రహించి, తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>