PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/roja-tdp-ysrcp-sr-ntr-nagari-jagan-south-heroine-rojafb71e726-945b-422d-8a00-8107aeebcd52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/roja-tdp-ysrcp-sr-ntr-nagari-jagan-south-heroine-rojafb71e726-945b-422d-8a00-8107aeebcd52-415x250-IndiaHerald.jpg చక్కటి నవ్వు అద్భుతమైన ఆహార్యం ఆమె సొంతం. తిరుపతి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టినరోజా 15 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందలకు పైగా చిత్రాల్లో చేసింది. 1972లో పుట్టినరోజు రోజా అసలు పేరు శ్రీలత. రోజా తండ్రి పేరు నాగరాజా రెడ్డి తండ్రి లలిత. ఈయన సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. అంతే కాదు ఆయన కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా తీశారు. తల్లి నర్స్ గా చేసేది. డిగ్రీలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన రోజా , ఎక్కువగా సినిమాలపై మక్కువ ఉండటంతో అలా 18 సంవత్సరాల వయసులో ప్రేమ ROJA; TDP; YSRCP;SR NTR; NAGARI; JAGAN;SOUTH HEROINE ROJA{#}dr rajasekhar;prema;rajendra prasad;Roja;Tirupati;engineer;Bhairavadweepam;Chandragiri;Nagari;Prasthanam;Girl;Election;marriage;Chitram;Congress;Heroine;YCP;CBN;TDP;Jagan;politics;Party;Love;Tollywood;Reddy;Telugu;Cinemaసినిమా To పాలిటిక్స్.. నగరిలో వికసించిన రోజా.?సినిమా To పాలిటిక్స్.. నగరిలో వికసించిన రోజా.?ROJA; TDP; YSRCP;SR NTR; NAGARI; JAGAN;SOUTH HEROINE ROJA{#}dr rajasekhar;prema;rajendra prasad;Roja;Tirupati;engineer;Bhairavadweepam;Chandragiri;Nagari;Prasthanam;Girl;Election;marriage;Chitram;Congress;Heroine;YCP;CBN;TDP;Jagan;politics;Party;Love;Tollywood;Reddy;Telugu;CinemaSat, 17 Aug 2024 09:03:00 GMT- సినిమాల్లో కూడా స్టార్ హోదా.
- సినీ గ్లామరే రాజకీయాల్లో కలిసి వచ్చిందా.?
- నగరిలో నమ్మిన బంటుగా ఎదిగిన రోజా.!

 రోజా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని  వెంకటేష్, బాలకృష్ణ,చిరంజీవి, తరం హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఒకప్పుడు ఈ హీరోలతో సమానంగా నటనలో పోటీ పడింది.  అలాంటి రోజా హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో ఓ మెరుపు మెరిసింది. టాలీవుడ్ అనే తోటలో విరబూసిన ఈ రోజా  అంచలంచలుగా ఎదుగుతూ రాజకీయాలు అనే అడవిలోకి వెళ్లి  తనకంటూ ప్రత్యేకమైన బౌండరీ గీసుకొని ప్రజల మనసును చురగొన్నది. అలాంటి రోజా రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, సినీ గ్లామర్ ఆమెకు ఏ విధంగా పనికివచ్చింది అనే వివరాలు చూద్దాం.

 సినిమాల నుంచి రాజకీయాల్లోకి:
 చక్కటి నవ్వు అద్భుతమైన ఆహార్యం ఆమె సొంతం. తిరుపతి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టినరోజా  15 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందలకు పైగా చిత్రాల్లో చేసింది.  1972లో పుట్టినరోజు రోజా అసలు పేరు శ్రీలత. రోజా తండ్రి పేరు నాగరాజా రెడ్డి తండ్రి లలిత. ఈయన సారథి స్టూడియోలో  సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. అంతే కాదు ఆయన కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా తీశారు. తల్లి నర్స్ గా చేసేది. డిగ్రీలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన రోజా , ఎక్కువగా సినిమాలపై మక్కువ ఉండటంతో అలా 18 సంవత్సరాల వయసులో ప్రేమ తపస్సు సినిమా కోసం రోజాను అడిగారట. అలా ఈ సినిమాలో నటన తెలియకుండానే నటించిందట ఇందులో రాజేంద్రప్రసాద్ కు హీరోయిన్ గా చేసింది. కానీ ఈ చిత్రం అనూహ్యంగా భారీ హిట్ అయింది. అప్పుడు మొదలైన సినీ ప్రయాణం భైరవద్వీపం వంటి అద్భుతమైన చిత్రాల్లో హీరోయిన్ గా చేసే స్థాయికి ఎదిగింది. ఇలా తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత 1991లో సెల్వమణితో పరిచయం ఏర్పడి 2002లో  తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.


ఇలా వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా పుట్టారు.  ఆ తర్వాత కొన్నాళ్లకు  కొంతమంది రాజకీయ నాయకుల కోసం ప్రచారానికి వెళ్లిన రోజా చాలా ఫేమస్ అయింది. అలా చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రోజాతో టిడిపి  ప్రచారం చేయించుకుందట. అలా టిడిపిలో రాష్ట్ర  మహిళా వింగ్ అధ్యక్షురాలుగా పనిచేస్తూ వచ్చిన రోజా, అలా 2004లో చంద్రబాబు ప్రోత్సాహంతో  నగరి నియోజకవర్గంలో టిడిపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రెండవసారి 2009లో  చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో రెండవసారి కూడా ఓడిపోయింది. అలా ఆమె ప్రతిసారి కొత్త నియోజకవర్గంలో పోటీ చేస్తూ దీనికి కారణం టిడిపి అని అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేసింది రోజా.  ఇదే టైంలో ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరాలని రాజశేఖర్ రెడ్డిని కలిసిందట.  ఈతరుణంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో, ఇక జగన్ వెంట ఉంటూ వైసీపీలో తన ప్రస్థానాన్ని  మొదలుపెట్టింది. అలా 2014 ఎన్నికల్లో నగరీ నియోజకవర్గంలో వైసిపి నుంచి పోటీ చేసి,  టిడిపి అభ్యర్థి మీద  అద్భుత గెలుపు సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. అలా 2019లో మరోసారి నగరి నుంచి గెలుపొందిన రోజా  జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ లో  మూడవసారి పోటీ చేసి దారుణంగా ఓటమిని చవి చూసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>