BusinessSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/whatsapp-users-122f0530-61ba-4f2b-b114-8003077f5ca7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/whatsapp-users-122f0530-61ba-4f2b-b114-8003077f5ca7-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ఫోన్‌ను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మెట్రో, ఆఫీసు, పబ్లిక్ ప్లేస్‌లల్లో ఫోన్ వాడేటప్పుడు కొన్నిసార్లు సీక్రెట్ అవసరం. పక్కవారు ఫోన్ చూడకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. అలా పక్కవారు మన ఫోన్‌ను చూడకుండా చేసేందుకు ఇప్పటి వరకూ ఏ ఫీచర్ లేదు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఓ సీక్రెట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిందనే నోటిఫికేషన్‌ను ఇప్పుడు ఎవ్వరూ చూడకుండా చేయొచ్చు. అయితే ఇందుకోసWhatsApp users {#}WhatsApp;Smart phoneవాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్WhatsApp users {#}WhatsApp;Smart phoneSat, 17 Aug 2024 13:00:00 GMTఈరోజుల్లో ఫోన్‌ను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మెట్రో, ఆఫీసు, పబ్లిక్ ప్లేస్‌లల్లో ఫోన్ వాడేటప్పుడు కొన్నిసార్లు సీక్రెట్ అవసరం. పక్కవారు ఫోన్ చూడకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. అలా పక్కవారు మన ఫోన్‌ను చూడకుండా చేసేందుకు ఇప్పటి వరకూ ఏ ఫీచర్ లేదు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఓ సీక్రెట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిందనే నోటిఫికేషన్‌ను ఇప్పుడు ఎవ్వరూ చూడకుండా చేయొచ్చు. అయితే ఇందుకోసం మీ ఫోన్‌లో ఓ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కిందికి స్క్రోల్ చేస్తే యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్స్‌పై క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే వాట్సాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వాట్సాప్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్‌లకు వెళ్తే మూడు గుర్తులు కనిపిస్తాయి. అన్ని ఫోన్లలో డిఫాల్ట్‌ ఆప్షన్ ఉంటుంది. ఆ మూడు ఆప్షన్లపై డిఫాల్డ్‌ను నిలిపివేయాలి. అలా చేసిన తర్వాత వాట్సాప్‌కు మెసేజ్ వచ్చినప్పుడల్లా ఫోన్లో వైబ్రేషన్ వస్తుంది. లేకుంటే సౌండ్ కానీ వస్తుంది. అయితే డిస్ ప్లేలో నోటిఫికేషన్ మాత్రం కనపడదు.  

ఇకపోతే వాట్సాప్‌లో చివరగా ఏ టైం వరకూ ఉన్నారనే దానిని కూడా సెట్టింగ్‌తో మార్చవచ్చు. మీరు ఆఖరిసారి వాట్సాప్‌లో ఏ టైంలో ఉన్నారనే విషయం తెలియదనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మై కాంటాక్ట్స్ లేదా నోబడీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లూ టిక్‌ను తీసేయొచ్చు. అలాగే అవతలి వ్యక్తి మీ మెసేజ్‌ను చదివినట్లు తెలియాలంటే బ్లూ టిక్ పడుతుంది. ఆ బ్లూ టిక్ ఎవరికీ తెలియకూడదనుకుంటే వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీపైన క్లిక్ చేయాలి. అక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆఫ్ చేయాల్సి ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>