PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ali-f6d98d4f-9576-45ee-afe4-6bcaef4b9a68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ali-f6d98d4f-9576-45ee-afe4-6bcaef4b9a68-415x250-IndiaHerald.jpgకమెడియన్ అలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నటుడు తెలుగులో 1000కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అలీ లేకుండా సినిమా తీయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కమెడియన్ పలు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో అలీ అంటే తెలియని వారు ఉండరేమో అనంత లాగా అతడు పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీ కారణంగానే రాజకీయాల్లో కూడా బాగా రాణించగలిగాడు. ali {#}Anushka;Rajahmundry;Athadu;media;babu mohan;Assembly;MLA;Comedian;March;ali;YCP;Telugu;television;Cinema;India;kalyan;Party;TDPసినీ గ్లామర్ కారణంగా రాజకీయాల్లో దుమ్ము రేపిన అలీ..?సినీ గ్లామర్ కారణంగా రాజకీయాల్లో దుమ్ము రేపిన అలీ..?ali {#}Anushka;Rajahmundry;Athadu;media;babu mohan;Assembly;MLA;Comedian;March;ali;YCP;Telugu;television;Cinema;India;kalyan;Party;TDPSat, 17 Aug 2024 10:00:00 GMT* సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీతో రాజకీయాల్లో రాణించిన అలీ  

* కమెడియన్ అలీ ప్రచారం చేస్తే ఏ పార్టీ అయినా గెలవాల్సిందే

* వైసీపీ వాడుకొని వదిలేసిందని విమర్శలు

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

కమెడియన్ అలీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నటుడు తెలుగులో 1000కు పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అలీ లేకుండా సినిమా తీయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కమెడియన్ పలు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో అలీ అంటే తెలియని వారు ఉండరేమో అనంత లాగా అతడు పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీ కారణంగానే రాజకీయాల్లో కూడా బాగా రాణించగలిగాడు.

అలీ 2019, మార్చి 11న వైసీపీ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత, పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆచారాలు చేశాడు. ఆయన కృషి వల్లే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. అతని కృషిని వైసీపీ పార్టీ గుర్తించింది. 2022లో, అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యాడు. అక్కడ అతను రెండేళ్లపాటు పనిచేశాడు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేదు.

అలీ 2024 ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించారడు. కానీ పార్టీ అతన్ని నిరాశపరిచింది. ఈ కారణంగా, అతను ఈ సంవత్సరం వైసీపీ కోసం ప్రచారం చేయలేదు. వైసీపీ కంటే ముందు అలీ నిమ్మల రామా నాయుడి సలహా మేరకు 1999లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2022లో వైసీపీలో చేరడానికి ముందు 20 ఏళ్ల పాటు టీడీపీలో సభ్యుడిగా ఉన్నాడు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా అలీ ఒకానొక సందర్భంలో పేర్కొన్నాడు. టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని కూడా ఆయన హింట్ ఇచ్చాడు కానీ ఎందుకో అది జరగలేదు. అలీ ఆడవాళ్ళపై చీప్ కామెంట్ చేశాడని అప్పట్లో బాగా విమర్శలు వచ్చాయి. అనుష్క శెట్టి గరం జిలేబి లాగా ఉంటుందని ఆమెను బికినీలో చూసిన సమయం నుంచి ఆమె ఫ్యాన్ అయిపోయాను అంటూ అతను చీప్ గా మాట్లాడాడు దానివల్ల కొంచెం ఇమేజి దెబ్బ తిన్నది. బాబు మోహన్ వంటి కమెడియన్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు కానీ అలీ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>