Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle73dbaf93-82cc-4106-8371-babb2e375082-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle73dbaf93-82cc-4106-8371-babb2e375082-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ నుంచి అనౌన్స్ అయ్యిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ చిత్రంపై భారీ హైప్ అప్పట్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు'చిత్రం మళ్లీ లైన్‌లోకి వచ్చింది. ఈ సినిమాపై ఎటువంటి భారీ అంచనాలు ఉన్నాయsocialstars lifestyle{#}m m keeravani;nidhi;Sangeetha;Bobby;Mega Surya Productions;Anupam Kher;Oscar;maya;Nidhhi Agerwal;Posters;krishna;BEAUTY;Music;Darsakudu;kalyan;Chitram;Episode;Heroine;Cinema;gold;Director;India;bollywoodహరిహర వీరమల్లు : మహారాణిగా నిధి అగర్వాల్.. బర్త్ డే పోస్టర్ అదిరిందిగా..!!హరిహర వీరమల్లు : మహారాణిగా నిధి అగర్వాల్.. బర్త్ డే పోస్టర్ అదిరిందిగా..!!socialstars lifestyle{#}m m keeravani;nidhi;Sangeetha;Bobby;Mega Surya Productions;Anupam Kher;Oscar;maya;Nidhhi Agerwal;Posters;krishna;BEAUTY;Music;Darsakudu;kalyan;Chitram;Episode;Heroine;Cinema;gold;Director;India;bollywoodSat, 17 Aug 2024 17:05:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ నుంచి అనౌన్స్ అయ్యిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ చిత్రంపై భారీ హైప్ అప్పట్లో నెలకొంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు'చిత్రం మళ్లీ లైన్‌లోకి వచ్చింది. ఈ సినిమాపై ఎటువంటి భారీ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చరిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్ట్ 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు చిత్ర బృందం. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా తయారైంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.ఇందులో నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ లో అదరగొట్టింది అని చెప్పాలి. తన డ్రెస్సింగ్ గాని ధరించిన ఆభరణాలు కానీ ఆమెకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి అని చెప్పవచ్చు.మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పంచమిగా నటిస్తుండగా మేకర్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ కి తీసుకురాబోతున్నారు. అలాగే నిన్ననే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలు కాగా పవన్ సినిమా సెట్స్ త్వరలోనే జాయిన్ కానున్నారు. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమైన విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్‌లను రూపొందించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>