MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ba66646-9f53-4fc1-8dcf-c53ed6c8de78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7ba66646-9f53-4fc1-8dcf-c53ed6c8de78-415x250-IndiaHerald.jpgడిప్యూటీ సీఎంగా ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్‌. దీంతో ఇప్పట్లో ఇక ఆయన సినిమాల షూటింగ్‌ మొదలయ్యే అవకాశం లేదనుకున్నారు. కానీ, హరిహర వీరమల్లు టీం మాత్రం యాక్టివ్‌ అయ్యింది. వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ వదిలింది మూవీ టీం. ఆగస్టు 14 నుంచి 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభించినట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని tollywood{#}Anupam Kher;Mega Surya Productions;m m keeravani;Bobby;producer;Producer;Oscar;Jr NTR;krishna;Darsakudu;Director;bollywood;Cinemaపవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్..!?పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: హరిహర వీరమల్లు షూటింగ్ అప్డేట్..!?tollywood{#}Anupam Kher;Mega Surya Productions;m m keeravani;Bobby;producer;Producer;Oscar;Jr NTR;krishna;Darsakudu;Director;bollywood;CinemaFri, 16 Aug 2024 16:35:00 GMTడిప్యూటీ సీఎంగా ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు పవన్‌. దీంతో ఇప్పట్లో ఇక ఆయన సినిమాల షూటింగ్‌ మొదలయ్యే అవకాశం లేదనుకున్నారు. కానీ, హరిహర వీరమల్లు టీం మాత్రం యాక్టివ్‌ అయ్యింది. వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ వదిలింది మూవీ టీం. ఆగస్టు 14 నుంచి 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభించినట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరన ప్రారంభించినట్టు మూవీ టీం

 వెల్లడించింది. అయితే పవన్‌ లేకుండానే షూటింగ్‌ మొదలుపెట్టినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే ఆయన ఈ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో జాయిన్‌ అవుతారని కూడా పేర్కొన్నారు మేకర్స్‌. సుమారు 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో ఈ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ మొదలుపెట్టినట్టు తెలిపారు.  స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చేతి ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో 'హరిహర వీరమల్లు' ఒకటి. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. దీంతో ఈ సినిమా కోసం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంతా ఎంతో

 ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, కొద్ది రోజులు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అందుకున్న‌ తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>