MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksabf916d8-e0de-42bc-9a10-0c4379047960-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksabf916d8-e0de-42bc-9a10-0c4379047960-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా బేబీ జాన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే మూవీ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా మరికొనks{#}BEAUTY;atlee kumar;keerthi suresh;kirti;Samantha;Kollywood;Tamil;Jaan;Industry;Remake;Joseph Vijay;John;Hero;Heroine;Interview;bollywood;Cinema;Teluguఆ మూవీ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే... కీర్తి సురేష్..?ఆ మూవీ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే... కీర్తి సురేష్..?ks{#}BEAUTY;atlee kumar;keerthi suresh;kirti;Samantha;Kollywood;Tamil;Jaan;Industry;Remake;Joseph Vijay;John;Hero;Heroine;Interview;bollywood;Cinema;TeluguFri, 16 Aug 2024 10:20:00 GMTఅందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో తమిళ , తెలుగు సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా బేబీ జాన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే మూవీ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.

సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. దానితో కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ... తేరి సినిమాలో సమంత పాత్రను అద్భుతంగా చూపించారు. ఆమె ఆ పాత్రలో ఎంతో బాగా ఒదిగిపోయింది. సాధారణంగా రీమిక్ సినిమాల్లో నటించడం ఎంతో కష్టమైన పని. అలాంటి సినిమాల్లో యాక్ట్ చేయాలి అంటే నాకు చాలా భయం. అయితే బేబీ జాన్ మూవీ లో నటించడానికి నేను ఏ మాత్రం భయపడలేదు.

ఎందుకంటే హీరోయిన్ పాత్రను చాలా అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా స్క్రీన్ పై చూపించారు. కథా పరంగా మూవీ యూనిట్ పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. తేరి సినిమా విడుదల అయిన 8 ఏళ్ల తర్వాత బేబీ జాన్ తెరకెక్కింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేశారు అని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. మరి బేబీ జాన్ మూవీ తో ఈ బ్యూటీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>