PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/cm-revanthb553450b-7316-4423-b7f8-7f5295583e77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/cm-revanthb553450b-7316-4423-b7f8-7f5295583e77-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు... అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. తాగు అలాగే సాగునీటి సమస్య... నిత్యం మనం వార్తలు చూస్తున్నాం. అలాగే కరెంటు సమస్యలు కూడా... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. cm revanth{#}KCR;amar;raja;revanth;Galla Jayadev;Gujarat - Gandhinagar;Telangana;Revanth Reddy;electricity;Mahbubnagar;Congress;Manam;Party;Governmentతెలుగు రాష్ట్రాల‌ అభివృద్ధికి ఆటంకాలు: ప్ర‌భుత్వాలు మార్పు...పారిశ్రామిక‌వేత్త‌ల దూరం దూరం?తెలుగు రాష్ట్రాల‌ అభివృద్ధికి ఆటంకాలు: ప్ర‌భుత్వాలు మార్పు...పారిశ్రామిక‌వేత్త‌ల దూరం దూరం?cm revanth{#}KCR;amar;raja;revanth;Galla Jayadev;Gujarat - Gandhinagar;Telangana;Revanth Reddy;electricity;Mahbubnagar;Congress;Manam;Party;GovernmentFri, 16 Aug 2024 07:45:00 GMT* రేవంత్ పాలనలో తరలిపోతున్న కంపెనీలు
* తెలంగాణను వదిలి వెళ్ళిపోతామని అమరరాజా ప్రకటన
* ఇప్పటికే గుజరాత్ కు ఓ కంపెనీ తరలింపు
* కెసిఆర్ పైన కోపం కంపెనీలపై చూపిస్తున్న రేవంత్?




తెలంగాణ రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు...  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. తాగు అలాగే సాగునీటి సమస్య... నిత్యం మనం వార్తలు చూస్తున్నాం. అలాగే కరెంటు సమస్యలు కూడా... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.


అయితే గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో... తెలంగాణ బ్రాండ్ అనేది దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. కానీ... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తెలంగాణకు రావలసిన కంపెనీలు ఆగిపోయాయని కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు తాజాగా... అమరరాజా కంపెనీ.. ఇష్యు కూడా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారింది.


కేటీఆర్ ఐటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు... అమర్ రాజా కంపెనీని ఒప్పించి తెలంగాణకు తీసుకువచ్చారు.  ఈ అమరరాజా కంపెనీ మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది. అయితే గత గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... అమరరాజా కంపెనీకి చాలా హామీలుఇచ్చారట.అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరరాజా కంపెనీకి ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదని స్వయంగా గల్లా జయదేవ్ ప్రకటించారు.

 
ఈ న్యూస్ నేషనల్ మీడియాలోనే మొదట వైరల్ గా మారింది. తమకు హామీలు అమలు పరచకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని హెచ్చరిస్తోంది అమర రాజా కంపెనీ. అంతేకాకుండా గుజరాత్కు అలాగే చెన్నైకి... రెండు కంపెనీలు తరలి వెళ్లినట్లు గులాబీ పార్టీ చెబుతోంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత అని కూడా గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. అయితే గతంలో గులాబీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కంపెనీలకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించడం లేదని...  ఓ వార్త వైరల్ అవుతుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం పైన కోపం వదిలి రేవంత్ రెడ్డి... కంపెనీలను ఆకర్షించాలని కోరుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>