MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movieba714242-7193-44e8-8f0b-83f6cb765cc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-movieba714242-7193-44e8-8f0b-83f6cb765cc4-415x250-IndiaHerald.jpgథియేటర్స్‌కు భారీగా జనం వస్తున్నారంటే ఏదో పెద్ద సినిమానే రిలీజ్ అయ్యి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి పెద్ద సినిమాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఒక వేళ పెద్ద సినిమాలు వచ్చినా కూడా అవి ప్రేక్షకులను అంతగా మెప్పించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే కష్టంగా మారింది. మరోవైపు ప్రేక్షకులు కూడా డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌కు అలవాటు పడిపోయారు. దీంతో ఓ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదు. ఎలాగో ఓటీటీల్లోకి వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చులే Devara movie{#}Shiva;mahesh babu;lord siva;Red chilly powder;RRR Movie;Prabhas;vijay kumar naidu;Director;Audience;Jr NTR;Ravi;ravi teja;ram pothineni;Cinemaవారి ఆశలన్నీ దేవర మూవీపైనే..తారక్ మూవీ కోసం థియేటర్స్ వెయిటింగ్వారి ఆశలన్నీ దేవర మూవీపైనే..తారక్ మూవీ కోసం థియేటర్స్ వెయిటింగ్Devara movie{#}Shiva;mahesh babu;lord siva;Red chilly powder;RRR Movie;Prabhas;vijay kumar naidu;Director;Audience;Jr NTR;Ravi;ravi teja;ram pothineni;CinemaFri, 16 Aug 2024 12:30:00 GMTథియేటర్స్‌కు భారీగా జనం వస్తున్నారంటే ఏదో పెద్ద సినిమానే రిలీజ్ అయ్యి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి పెద్ద సినిమాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఒక వేళ పెద్ద సినిమాలు వచ్చినా కూడా అవి ప్రేక్షకులను అంతగా మెప్పించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే కష్టంగా మారింది. మరోవైపు ప్రేక్షకులు కూడా డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌కు అలవాటు పడిపోయారు. దీంతో ఓ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదు. ఎలాగో ఓటీటీల్లోకి వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చులే అనే ధీమాతో ఆడియన్స్ ఉంటున్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తేనే తప్పా థియేటర్లలోకి ఆడియన్స్ అడుగుపెట్టడం లేదు. చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలైనా మౌత్ టాక్‌తో మెల్లగా జనాల్లోకి వెళ్తాయి. ఇప్పుడు పబ్లిక్ కూడా వీకెండ్‌లో సినిమాలు చేయాలనే ఇంటెన్షన్‌తో ఉండటం లేదు. క్రౌడ్ ఫుల్ అవ్వాలంటే మాత్రం భారీ హిట్ టాక్ రావాల్సిందే మరి. అలాంటి స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ రెండే వచ్చాయి.

మహేష్ బాబు గుంటూరు కారం వచ్చినా అంతగా ఆడలేదు. ఆ తర్వాత మొన్న ప్రభాస్ కల్కి వచ్చింది. అలాగే మధ్యలో వచ్చి హనుమాన్ మూవీ మంచి టాక్‌తో క్రౌడ్ పుల్లర్ చిత్రంగా నిలిచింది. అలాగే కల్కి వల్ల భారీగా ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి వచ్చారు. దీంతో తెలుగుతో పాటుగా హిందీలో కూడా మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ, రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే క్రౌడ్ ఎంత వరకూ వస్తుందనేది తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పుడు అందరూ దేవర మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించేది దేవర మూవీనే అని నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత నార్త్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి మంచి క్రేజ్ పెరిగింది.

తారక్ ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటాయనే విషయం ఇప్పటికే అర్థం అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్‌తో ఆచార్య మూవీ చేసిన తర్వాత ఇప్పుడు దేవర చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ మూవీపైనే నమ్మకం పెంచుకున్నారు. అయితే దేవర మూవీ ఏ మేరకు ఈ ఏడాది క్రౌడ్ పుల్లర్‌గా నిలుస్తుందనేది వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>