MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1457b677-18cc-4733-9f44-f0cfeb08fd4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1457b677-18cc-4733-9f44-f0cfeb08fd4c-415x250-IndiaHerald.jpgగ‌త కొంత‌కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ‘ఇండిపెండెన్స్‌’ని పొందింది విక్ర‌మ్ న‌టించిన హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ చిత్రం ‘తంగ‌లాన్‌’. రిలీజ్‌కు ముందు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ సినిమాపై అంచ‌నాలను ఎక్కడా డ్రాప్ అవ్వనీయలేదు. విలక్షణ నటుడు విక్రమ్ చేస్తున్న మరో విలక్షణ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేకర్స్ వెనకడుగు వేయలేదు. అలా అంతకంతకు అంచనాలను ఈ సినిమా పెంచుకుంటూనే వచ్చింది. హీరో విక్రమ్‌తో tollywood{#}Hero;Darsakudu;Director;vikram;Chitram;Cinemaవిక్రమ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తంగలాన్..!?విక్రమ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తంగలాన్..!?tollywood{#}Hero;Darsakudu;Director;vikram;Chitram;CinemaFri, 16 Aug 2024 18:35:00 GMTగ‌త కొంత‌కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ‘ఇండిపెండెన్స్‌’ని పొందింది విక్ర‌మ్ న‌టించిన హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ చిత్రం ‘తంగ‌లాన్‌’. రిలీజ్‌కు ముందు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ సినిమాపై అంచ‌నాలను ఎక్కడా డ్రాప్ అవ్వనీయలేదు. విలక్షణ నటుడు విక్రమ్ చేస్తున్న మరో విలక్షణ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేకర్స్ వెనకడుగు వేయలేదు. అలా అంతకంతకు అంచనాలను ఈ సినిమా పెంచుకుంటూనే వచ్చింది. హీరో విక్రమ్‌తో పాటు దర్శకుడు పా రంజిత్ కూడా సినిమాలను రూపొందించడంలో

 తనదైన మార్క్, ఆర్ట్ వర్క్ ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. విక్రమ్ కెరీర్‌లో 61వ చిత్రం కావడంతో ఈ మూవీపై స్పెషల్ అటెన్షన్ పెరిగింది. ఈ చిత్రానికి ఉన్న అంచనాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసింది. తమిళనాడు, ఏపీ, నైజాంలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తోలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. తమిళంలో విక్రమ్‌ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. తమిళంలో

 11 కోట్లు నికరంగా 15 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగులో 1.5 కోట్లు నికరంగా, 3 కోట్ల గ్రాస్, మలయాళంలో 20 లక్షలు నికరంగా 50 లక్షల గ్రాస్, కన్నడలో 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తంగలాన్ చిత్రం రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 26.44 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సానకూలంగా ఓపెనింగ్స్ కనిపించాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఈ చిత్రం 66 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది ..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>