PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth353042b5-dd40-4bf8-a19a-885888f96c8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth353042b5-dd40-4bf8-a19a-885888f96c8e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో చాలా భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత గులాబీ పార్టీ 10 సంవత్సరాల పాటు పాలనలో ఉంది. అటు ఏపీలో.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. revanth{#}KCR;revanth;Telangana;Revanth Reddy;Telugu;Reddy;Manam;Jagan;Party;Government;Andhra Pradesh;CBNతెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం: అప్పుల్లో ఉందని ముందే డప్పు కొట్టుకోవడం ?తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం: అప్పుల్లో ఉందని ముందే డప్పు కొట్టుకోవడం ?revanth{#}KCR;revanth;Telangana;Revanth Reddy;Telugu;Reddy;Manam;Jagan;Party;Government;Andhra Pradesh;CBNFri, 16 Aug 2024 07:47:00 GMT
* కెసిఆర్ పాలనలో 7 లక్షల అప్పులు అంటూ రేవంత్ ప్రచారం
* జగన్ అప్పులు చేశారని బాబు శ్వేత పత్రాల హడావిడి
* అప్పుల లెక్కలు చూసి భయపడుతున్న పారిశ్రామిక వేత్తలు  



ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో చాలా భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత గులాబీ పార్టీ 10 సంవత్సరాల పాటు పాలనలో ఉంది. అటు ఏపీలో.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. అంటే దాదాపు చంద్రబాబు నాయుడు దే.. ఏపీలో హవా అన్న మాట. అయితే... రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అప్పులు ఆటంకంగా మారాయి. ప్రతి రాష్ట్రం అప్పులు కచ్చితంగా చేస్తుంది. కానీ ఎఫ్ ఆర్ బి ఎం పరిధి దాటి ఏ రాష్ట్రానికి కూడా అప్పులు పుట్టవు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పరిధిలోపే అప్పులు చేస్తాయి.


కానీ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పాలించిన తర్వాత...  ఆ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి అప్పులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ వెళ్లిపోయాడని విమర్శలు చేస్తున్నారు. మిత్తిలు కట్టడానికి కూడా డబ్బులు ఉండడం లేదని తెలంగాణ రాష్ట్ర పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణను అలా బూచిగా చూపిస్తే... పెట్టుబడులు పెట్టేవారు కాస్త ఆలోచిస్తారు.


ఇప్పటికే అప్పులో ఉన్న రాష్ట్రానికి మళ్లీ మనం పెట్టుబడులు పెడితే నష్టమే ఉంటుందని వాళ్ళు భావించి వెనక్కి వెళ్లే అవకాశంలు ఉంటాయి.ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో.. అప్పులు బాగా చేశారని చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు కూడా రిలీజ్ చేశారు. అయితే అప్పులు బాగా అయ్యాయని ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తారు పారిశ్రామికవేత్తలు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా... గత ప్రభుత్వ అప్పుల లెక్కలు బహిరంగం చేయకుండా... ప్రస్తుత డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలి. కొత్త కంపెనీలను... రాష్ట్రాలకు తీసుకురావాలి. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>