PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp81d36782-8630-4af6-a797-73f750142fd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp81d36782-8630-4af6-a797-73f750142fd6-415x250-IndiaHerald.jpg పుంగనూరులో పెద్దిరెడ్డి ... పులివెందుల లో జగన్ - మాచర్లలో పిన్మెల్లి రామకృష్ణారెడ్డి అయితే టిడిపికి చెందిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా నామినేషన్ వేయకుండా ఆయా మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక మాచర్లలో జరిగిన దౌర్జన్యాలు దారుణాలు ఎక్కడ జరగలేదు. అక్కడ మొత్తం 31 వార్డులు ఉంటే మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. tdp{#}Telugu Desam Party;Jagan;TDP;YCPబిగ్ ట్విస్ట్‌... టీడీపీ ఖాతాలో వైసీపీ ఏక‌గ్రీవ మున్సిపాల్టీ.. !బిగ్ ట్విస్ట్‌... టీడీపీ ఖాతాలో వైసీపీ ఏక‌గ్రీవ మున్సిపాల్టీ.. !tdp{#}Telugu Desam Party;Jagan;TDP;YCPFri, 16 Aug 2024 14:12:06 GMT- ( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ ) .

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ ఎంత దౌర్జన్యాలు చేసిందో చూశాం. తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేయకుండానే చాలా చోట్ల వైసిపి వాళ్ళు స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ... పులివెందుల లో జగన్ - మాచర్లలో పిన్మెల్లి రామకృష్ణారెడ్డి అయితే టిడిపికి చెందిన అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా నామినేషన్ వేయకుండా ఆయా మున్సిపాలిటీలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక మాచర్లలో జరిగిన దౌర్జన్యాలు దారుణాలు ఎక్కడ జరగలేదు. అక్కడ మొత్తం 31 వార్డులు ఉంటే మొత్తం ఏకగ్రీవం అయ్యాయి. నియోజ‌క‌వ‌ర్గం లో ఉన్న అన్ని పంచాయ‌తీ ల్లోనూ ఏక‌గ్రీవాలు చేసేసుకున్నారు. ఇక మాచ‌ర్ల మున్సిపాల్టీలో మొదటి రెండేళ్లు బుద్ధ వెంకన్న - బొండా ఉమాపై హత్యాయత్నం చేసినా తురగా కిషోర్ కు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. తర్వాత అత‌డి కి వేరే పదవి ఇచ్చి మరో వ్యక్తికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు.


ఇప్పుడు మాచర్లలో కాదు .. రాష్ట్ర మొత్తం వైసిపి ఓడిపోవడంతో ఏకగ్రీవమైన మున్సిపల్ కౌన్సిలర్లు అంతా వరుస పెట్టి టీడీపీ బాటపడుతున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలో కూడా ఇప్పుడు చైర్మన్ ... వైస్ చైర్మన్ అదే బాటలో ఉన్నారు. పిన్మెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనకు బయట‌కు వచ్చినా మాచర్లలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇక తుర‌కా కిషోర్ తో పాటు పిన్నెల్లి దౌర్జన్యం ... దుర్మార్గాల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరు పరారీ లో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్టు చేసిన మాచర్ల వైసీపీ నేతలు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ వైసిపికి దిక్కు లేకుండా పోయింది. అప్పుడు కండబలం - రౌడి బలంతో మున్సిపాలిటీని ఏకగ్రీవం చేసుకున్నారు .. కానీ పవర్ లేకపోతే వారెవరు తమతో పాటు ఉండరని ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమైంది. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి ... కానీ రౌడీయిజంతో చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది పవర్ పోయాక ఏం జరుగుతుంది అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>