PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hindupuram58fc3d23-244a-4bf8-b368-ae46a38b3fdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hindupuram58fc3d23-244a-4bf8-b368-ae46a38b3fdf-415x250-IndiaHerald.jpgవైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష అధినేత హోదా కూడా లేదు. జగన్ రెడ్డి ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఈ క్రమంలోనే ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాష్ట్రం అంతటా వరుస పెట్టి పెద్ద షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కీలక నేతలు మాజీ మంత్రులు ... పార్టీ జిల్లా అధ్యక్షులు .. మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నేతల ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు.hindupuram{#}Hindupuram;Elections;MLA;Balakrishna;Telugu Desam Party;local language;Assembly;Jagan;TDP;YCPహిందూపురంలో వైసీపీని మ‌టాష్ చేసిన న‌ట‌సింహం.. ఎంత దెబ్బ కొట్టాడో చూడండి..?హిందూపురంలో వైసీపీని మ‌టాష్ చేసిన న‌ట‌సింహం.. ఎంత దెబ్బ కొట్టాడో చూడండి..?hindupuram{#}Hindupuram;Elections;MLA;Balakrishna;Telugu Desam Party;local language;Assembly;Jagan;TDP;YCPFri, 16 Aug 2024 14:21:00 GMTఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష అధినేత హోదా కూడా లేదు. జగన్ రెడ్డి ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఈ క్రమంలోనే ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాష్ట్రం అంతటా వరుస పెట్టి పెద్ద షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కీలక నేతలు మాజీ మంత్రులు ... పార్టీ జిల్లా అధ్యక్షులు .. మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన నేతల ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. చాలామంది కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీలుగా ఉన్న టిడిపి జనసేనలో చేరుతున్నారు. ఇక వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా చకచకా కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఒక నియోజకవర్గంలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది.


హిందూపురం పేరు చెబితే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2014 - 2019 - 2024 ఎన్నికలలో ఆయన వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో బాలయ్యకు హిందూపురంలో ఏకంగా 35 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత హిందూపురంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఇంద్రజ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ మారిన నేతలకు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. వైసీపీలో ఉంటే అస్సలు అభివృద్ధి లేదని ... తాము హిందూపురం అభివృద్ధి కోసం టిడిపిలో చేరినట్టు చెప్పారు. అది ఏమైనా హిందూపురం లాంటి చోట అసలే వైసిపికి పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పార్టీ మారటం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>