PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vidadala-rajini-ysrcp-tdp-kutami-ap-jogi-ramesh-jagan3370bcb4-87bd-4934-a770-905e724759a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/vidadala-rajini-ysrcp-tdp-kutami-ap-jogi-ramesh-jagan3370bcb4-87bd-4934-a770-905e724759a6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది. ఆ పార్టీలోని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంతోమంది నాయకులు కూడా ఓడిపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విడదల రజిని. ఈమె జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి అద్భుతమైన సేవలు అందించింది. వీటితోపాటు పలు అక్రమాలు కూడా చేసిందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఎలక్షన్స్ లో ఈమె ఓడిపోవడం , టిడిపి కూటమి గెలవడంతో వీరి యొక్క అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా విడదల రజిని అక్రమాలు కొన్ని బయటVIDADALA RAJINI;YSRCP; TDP KUTAMI;AP; JOGI RAMESH;JAGAN{#}Chilukaluripeta;AgriGold;Anti-Corruption Bureau;JOGI RAMESH;Election;Y. S. Rajasekhara Reddy;CBN;Jagan;YCP;News;TDP;Andhra Pradesh;Government;Minister;Partyటార్గెట్ విడదల రజిని.. అరెస్ట్ తప్పదా?టార్గెట్ విడదల రజిని.. అరెస్ట్ తప్పదా?VIDADALA RAJINI;YSRCP; TDP KUTAMI;AP; JOGI RAMESH;JAGAN{#}Chilukaluripeta;AgriGold;Anti-Corruption Bureau;JOGI RAMESH;Election;Y. S. Rajasekhara Reddy;CBN;Jagan;YCP;News;TDP;Andhra Pradesh;Government;Minister;PartyFri, 16 Aug 2024 09:35:32 GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి చవి చూసింది. ఆ పార్టీలోని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంతోమంది నాయకులు కూడా ఓడిపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  విడదల రజిని. ఈమె జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి అద్భుతమైన సేవలు అందించింది. వీటితోపాటు పలు అక్రమాలు కూడా చేసిందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఎలక్షన్స్ లో ఈమె ఓడిపోవడం , టిడిపి కూటమి గెలవడంతో వీరి యొక్క అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  తాజాగా విడదల రజిని అక్రమాలు కొన్ని బయటకు రావడంతో ఈమె త్వరలో అరెస్టు కాబోతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు మార్కు పాలన మొదలైంది. ఇదే తరుణంలో  గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వారందరి చిట్టా బయటకు తీసి అరెస్టులు చేస్తున్నారు. అయితే జోగి రమేష్  కుమారుడు ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా అమ్మేశాడు అనే కేసులో ఏసీబీ అరెస్టు చేసింది.

 అంతేకాకుండా ఆయన ఉద్యోగాల పేరుతో వసూళ్లు కూడా చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే తరుణంలో చిలుకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన కొన్ని అక్రమాల గురించి ఈ మధ్యకాలంలో అనేక ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి. జగనన్న ఇళ్ల స్థలాల పేరిట రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు భూములు కొని, ప్రభుత్వం నుంచి ఎక్కువ ధరకు డబ్బులు తీసుకొని ఒక స్కామ్ చేశారు. రైతులకు తక్కువ అమౌంట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఎవరైతే వైసిపి లబ్ధిదారులు ఉన్నారో వారంతా ఫిర్యాదు చేసిన వారికి నగదు వెనక్కి ఇచ్చేసి కాంప్రమైజ్ అయ్యారట. ఇదే తరుణంలో మాజీ మంత్రి విడుదల రజిని మీద ఒక ఫిర్యాదు అందింది.

ఆ నియోజకవర్గంలో కొంతమంది క్రషర్ యజమానుల దగ్గరికి వెళ్లి విడుదల రజిని అనుచరులు కొంతమంది వెళ్లి 50 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అధికారులను అడ్డుగా పెట్టుకుని వీరు అక్రమంగా ఇవి నడుపుతున్నారని 50 కోట్ల ఫైన్ వేస్తామని బెదిరింపులకు గురి చేసి రెండు కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారట. ప్రస్తుతం ఆ యజమానులంతా ఏకమై  రజిని అనుచరులపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.  అయితే గతంలో వైసిపి నాయకుడిగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ దగ్గర విడుదల రజిని కొంత అమౌంట్ తీసుకున్నారట. కొంత అమౌంటు తిరిగి ఇచ్చి, మిగతాది ఇవ్వలేదట. దీనిపై కూడా ఆయన పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవే కాకుండా చాలా కేసులు విడుదల రజనీపై పడే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక్కో కేసు చివరికి విడుదల రజని వరకు చేరితే మాత్రం ఆమె అరెస్టు తప్పదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>