MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood140c3b11-935f-4806-a2e4-4a76db8454bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood140c3b11-935f-4806-a2e4-4a76db8454bc-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎన్టీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు tollywood{#}Janhvi Kapoor;Shiva;lord siva;Avunu;september;Mister;NTR;India;Darsakudu;Director;Jr NTR;Cinema;News;bollywoodషాకింగ్; పేరు మార్చుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!?షాకింగ్; పేరు మార్చుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!?tollywood{#}Janhvi Kapoor;Shiva;lord siva;Avunu;september;Mister;NTR;India;Darsakudu;Director;Jr NTR;Cinema;News;bollywoodThu, 15 Aug 2024 14:29:32 GMTజూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎన్టీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు. ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో

 తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో తారక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మాస్ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దేవర సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్-2’లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనే పదాన్ని తొలగిస్తారా అంటే అవును

 అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఒక అఫీషియల్ ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయడంతో  జూనియర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పటికే 40 సంవత్సరాల వయసు దాటిన నేపథ్యంలో జూనియర్ అనే ట్యాగ్ అవసరం లేదని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు జూనియర్ అనే పేరు పెద్దగా సెట్ అవడం లేదనేది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తన బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే మిస్టర్ ఎన్టీఆర్ అని పెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>