MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/committee-boys-heroine192969d0-614c-4309-9364-5f330e21cd67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/committee-boys-heroine192969d0-614c-4309-9364-5f330e21cd67-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన తొలి మూవీ "కమిటీ కుర్రోళ్ళు" మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. నాస్టాల్జిక్ సీన్లతో ఈ యూత్‌ఫుల్ డ్రామా చాలామందిని ఆకట్టుకుంది. యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బాగా డబ్బులు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇది చిన్న మూవీ అని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో ఉన్నట్లు చూపించిన స్ట్రాంగ్ పర్ఫామెన్స్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాలో 11 మంది హీరోలు, చాలామంది హీరోయిన్లు నటించారు. ఆ హీరోయిన్లలో పద్మ క్యారెక్టర్ పోషించిన హీరోయిన్ విషిక చాలCommittee Boys heroine{#}tara;vamsi;Odisha;Vishakapatnam;silver screen;Telugammayi;Fidaa;niharika konidela;Audience;Andhra Pradesh;Heroine;Cinema;Telugu"కమిటీ కుర్రోళ్ళు" హీరోయిన్ గ్లామరస్ ఫొటోలు వైరల్.. పిచ్చెక్కిస్తున్నాయిగా.."కమిటీ కుర్రోళ్ళు" హీరోయిన్ గ్లామరస్ ఫొటోలు వైరల్.. పిచ్చెక్కిస్తున్నాయిగా..Committee Boys heroine{#}tara;vamsi;Odisha;Vishakapatnam;silver screen;Telugammayi;Fidaa;niharika konidela;Audience;Andhra Pradesh;Heroine;Cinema;TeluguThu, 15 Aug 2024 13:00:00 GMTమెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన తొలి మూవీ "కమిటీ కుర్రోళ్ళు" మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. నాస్టాల్జిక్ సీన్లతో ఈ యూత్‌ఫుల్ డ్రామా చాలామందిని ఆకట్టుకుంది. యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బాగా డబ్బులు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇది చిన్న మూవీ అని చాలామంది అనుకుంటారు కానీ ఇందులో ఉన్నట్లు చూపించిన స్ట్రాంగ్ పర్ఫామెన్స్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమాలో 11 మంది హీరోలు, చాలామంది హీరోయిన్లు నటించారు. ఆ హీరోయిన్లలో పద్మ క్యారెక్టర్ పోషించిన హీరోయిన్ విషిక చాలా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె కేరెక్టరైజేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ సినీ తార అచ్చ తెలుగు అమ్మాయి కావడం మరో విశేషం. విషిక తన క్యారెక్టర్ తో ఈ సినిమా ద్వారా చాలామందికి కనెక్ట్ అయింది అందరి దృష్టిని తనువైపే తిప్పుకుంది ఇప్పుడు కొన్ని గ్లామరస్ పిక్స్ తో ఆమె మరింత మందిని ఆకట్టుకుంటోంది. కొన్ని ఫోటోల్లో ఆమె చూపించిన అందాలకు ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు.

విషిక తెలుగమ్మాయి అయినా ఒడిశాలోనే పుట్టింది. అక్కడే పెరిగింది. తర్వాత ఆమె ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అయింది. విషిక ఇంటర్మీడియట్ వరకు ఒడిశా లోనే చదువుకుంది. బీటెక్ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేసింది. విషికకు అతను నుంచే సినిమాలో ఆక్ట్ చేయాలని ఆశ ఉండేది. అందుకే ఆమె తెలుగు సినిమాల్లో ఆఫర్ల కోసం ట్రై చేసింది. అలా కమిటీ కుర్రోళ్ళు సినిమాలో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి దీనికంటే  ముందు విషిక సినిమాల్లో చేసింది కానీ అవి చాలా చిన్న పాత్రలు కాబట్టి పాపులర్ కాలేకపోయింది. 2019లో "ఎమోషనల్ ఫుల్" సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన ఈ అందాల తార తర్వాత పరువు, పరంపర అనే వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించింది. లావణ్య త్రిపాఠి "హ్యాపీ బర్త్ డే" చిత్రంలోనూ ఓ చిన్న వేషం వేసింది. ఆమె నటించిన పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ నటించిన "పతంగ్" సినిమా రిలీజ్ కానుంది. కమిటీ కుర్రాళ్లు సినిమాలో ట్రెడిషనల్ గా కనిపించిన బయట మాత్రం గ్లామర్ షో చేస్తుంది ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తుంటే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>