PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan33513475-56a3-4d2f-91ef-3b3cb744cb69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan33513475-56a3-4d2f-91ef-3b3cb744cb69-415x250-IndiaHerald.jpgజగన్ పేరుకు మాత్రమే సీట్లు పదవులు ఇస్తారు. కానీ.. వారికి రాజ్యాధికారం ఎప్పుడూ ఇవ్వ‌రూ అన్నది వాస్తవం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ నుంచి అప్పటివరకు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారిపోవడంతో.. జగన్ మైలవరం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల తిరుపతిరావు అనే వ్యక్తికి మైలవరం టిక్కెట్ ఇచ్చారు.jagan{#}JOGI RAMESH;Mylavaram;Tirupati;NTR;House;Party;India;krishna;Minister;YCP;Jaganఆ యాదవ నేత పొలిటికల్ లైఫ్ సర్వనాశనం చేసిన జగన్.. !ఆ యాదవ నేత పొలిటికల్ లైఫ్ సర్వనాశనం చేసిన జగన్.. !jagan{#}JOGI RAMESH;Mylavaram;Tirupati;NTR;House;Party;India;krishna;Minister;YCP;JaganThu, 15 Aug 2024 17:09:31 GMT- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) .

జగన్ ఇటీవల సాధారణ ఎన్నికలలో చాలామంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు టిక్కెట్లు ఇచ్చానని.. 50 శాతానికి పైగా ఈ వర్గాలకు టికెట్లు ఇచ్చాను అంటూ ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జగన్ పేరుకు మాత్రమే సీట్లు పదవులు ఇస్తారు. కానీ.. వారికి రాజ్యాధికారం ఎప్పుడూ ఇవ్వ‌రూ అన్నది వాస్తవం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ నుంచి అప్పటివరకు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారిపోవడంతో.. జగన్ మైలవరం జడ్పిటిసిగా ఉన్న స‌ర్నాల తిరుపతిరావు అనే వ్యక్తికి మైలవరం టిక్కెట్ ఇచ్చారు.


వాస్తవంగా చూస్తే తిరుపతి రావును జడ్పిటిసి చేసింది వసంత కృష్ణ ప్రసాద్. అయితే సామాన్యుడు.. చివరకు సొంత ఇల్లు కూడా లేని తిరుపతిరావుని నిలబెట్టి కృష్ణ ప్రసాద్ ను ఓడించాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక సామాన్య కార్యకర్తకు పెత్తందారు కు జరుగుతున్న పోటీ ఇది అని కూడా వైసిపి వాళ్ళు ప్రచారం చేశారు. పేరుకు తిరుపతిరావుకు సీటు ఇచ్చారు. తప్ప పెతనమంతా రెడ్లే చేశారు. చివరకు అక్కడ ప్రచార బాధ్యతలు, మనీ మేనేజ్మెంట్ అంతా రెడ్లు చెప్పినట్లు జరిగింది.


ఫైనల్ గా ఎన్నికలలో తిరుపతిరావు 40 వేల ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఓటమి తర్వాత తిరుపతిరావు అడ్రస్ లేకుండా పోయారు. అలా అనటం కంటే తిరుపతిరావు యాదవను జగన్ బలి పశువు చేసేసారు అని చెప్పాలి. ఎన్నికల్లో పెనమలూరులో పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు.. ఇప్పుడు మైలవరం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అలా మైలవరంలో జోగి రమేష్ కు బాధ్యతలు ఇచ్చి.. తిరుపతిరావు యాదవను పక్కన పెట్టేశారు. ఇప్పుడు తిరుపతిరావు వైసీపీలో అసలు అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>