Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wrestler-vinesh532bbe40-4e61-4be6-a875-2663559ff061-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wrestler-vinesh532bbe40-4e61-4be6-a875-2663559ff061-415x250-IndiaHerald.jpgపారిస్ ఒలింపిక్స్‌లో పోటీ చేయకుండా నిషేధించినందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కోర్టుకు వెళ్లారు. ఆమె కేసులో కొద్ది గంటల క్రితమే తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చేదాకా ఆమె పారిస్‌లోనే ఉండి, భారతదేశానికి రాకూడదని ఆమె నిర్ణయించుకుంది. కోర్టు కూడా తీర్పును వాయిదా వేస్తూనే ఉంది. మొదట చెప్పిన తేదీకి తీర్పు రాకపోయి, ఇప్పుడు ఆగస్టు 16కి వాయిదా పడింది. అయితే ఆమె ప్రెజరైజ్ చేయడం వల్ల ఎట్టకేలకు ఈ తీర్పు అనేది విడుదల అయింది. సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలంటూ వినేశ్‌ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ రిజెక్ట్ చేసWrestler Vinesh{#}Saturday;Paris;courtఇండియాకి వచ్చేది లేదన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌.. అని ఇప్పుడు డెసిషన్ చేంజ్ ??ఇండియాకి వచ్చేది లేదన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌.. అని ఇప్పుడు డెసిషన్ చేంజ్ ??Wrestler Vinesh{#}Saturday;Paris;courtThu, 15 Aug 2024 11:00:00 GMTపారిస్ ఒలింపిక్స్‌లో పోటీ చేయకుండా నిషేధించినందుకు రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కోర్టుకు వెళ్లారు. ఆమె కేసులో కొద్ది గంటల క్రితమే తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చేదాకా ఆమె పారిస్‌లోనే ఉండి, భారతదేశానికి రాకూడదని ఆమె నిర్ణయించుకుంది. కోర్టు కూడా తీర్పును వాయిదా వేస్తూనే ఉంది. మొదట చెప్పిన తేదీకి తీర్పు రాకపోయి, ఇప్పుడు ఆగస్టు 16కి వాయిదా పడింది. అయితే ఆమె ప్రెజరైజ్ చేయడం వల్ల ఎట్టకేలకు ఈ తీర్పు అనేది విడుదల అయింది. సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలంటూ వినేశ్‌ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ రిజెక్ట్ చేసింది.

 16వ తారీకు తీర్పు ఇవ్వాల్సి ఉండగా 15 తారీకు తీర్పు ఇచ్చేసింది. అంతకు ముందు వరకు చాలా వాయిదాలు విధించింది. అందువల్ల ఈ మహిళ ప్రజలారా తాను ఇండియాకి రానంటూ పీస్ నుంచి ఇప్పుడు ఆమెకు కాస్‌ చాలా పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ కలలు చెదిరిపోయాయి. క్రీడాకారిణి ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ కి ముందు కొలతల సమయంలో అనర్హత వేటుకు గురైంది. ఆమె ఫైనల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం సరైనదా కాదా అని కోర్టులో కేసు వేశారు. ఈ కేసుపై తీర్పు వచ్చే తేదీ మొదట ఆగస్టు 13గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీని మార్చి, ఆగస్టు 16కి వాయిదా వేశారు. మళ్లీ 15కే తీర్పు వెలువరించి ఆశ్చర్యపరిచారు.

వినేశ్‌ ఒలింపిక్స్‌లో 50 కిలోల బరువు వర్గంలో పోటీ చేయాలి. కానీ, పోటీ ప్రారంభం కాకముందు ఆమె బరువును తనిఖీ చేసినప్పుడు, ఆమె బరువు నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందని తేలింది. దీంతో ఆమెను పోటీ నుండి తొలగించారు. తనను అన్యాయంగా తొలగించారని భావించిన వైనెస్ వినేశ్‌, కోర్టుకు వెళ్లింది. తనకు రజత పతకాన్ని ఇవ్వాలని కోరింది. కోర్టు కూడా ఆమె విజ్ఞప్తిని పరిశీలించి రిజెక్ట్ చేసింది.

వినేశ్‌ బరువు నిబంధనలను పాటించలేకపోయినందున, భారతీయ ఒలింపిక్ అసోసియేషన్‌లోని సభ్యులు, అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. తోటి రెజ్లర్ బజరంగ్ పునియా ప్రకారం, రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆగస్టు 17, శనివారం న్యూఢిల్లీకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉందట. తీర్పు వచ్చింది కాబట్టి ఆమె ఇండియాకి తిరిగి వస్తున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>