HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/coconuts-3e495450-aaef-4cfb-ad9e-25581db09acd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/coconuts-3e495450-aaef-4cfb-ad9e-25581db09acd-415x250-IndiaHerald.jpgమార్కెట్‌లో కొబ్బరి కాయ ధరలు హెచ్చుతగ్గులకు గురికావడం కామన్. పండగలొచ్చినప్పుడు వాటికి రిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దార కూడా పెరిగిపోతుంది. ఈ ధరల భారం పడకుండా చాలా మంది కొబ్బరి కాయలను ముందే కొని స్టోర్ చేసుకుంటారు. అని ఇలా స్టోర్ చేసిన కొన్ని రోజులకే అవి బూజుపట్టి ఉపయోగించడానికి పనికి రాకుండా పోతాయి. అందరూ కొబ్బరికాయ కొట్టాక ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అవి నీరు పడతాయి దానివల్ల వాటిని కూడా తినలేము. మరి ఎలా పాడుకాకుండా స్టోర్‌ చేయాలి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. coconuts {#}salt;Aquaకొబ్బరికాయలు, చిప్పలను ఎక్కువకాలం స్టోర్ చేసుకోవాలా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..?కొబ్బరికాయలు, చిప్పలను ఎక్కువకాలం స్టోర్ చేసుకోవాలా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..?coconuts {#}salt;AquaThu, 15 Aug 2024 18:00:00 GMTమార్కెట్‌లో కొబ్బరి కాయ ధరలు హెచ్చుతగ్గులకు గురికావడం కామన్. పండగలొచ్చినప్పుడు వాటికి రిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దార కూడా పెరిగిపోతుంది. ఈ ధరల భారం పడకుండా చాలా మంది కొబ్బరి కాయలను ముందే కొని స్టోర్ చేసుకుంటారు. అని ఇలా స్టోర్ చేసిన కొన్ని రోజులకే అవి బూజుపట్టి ఉపయోగించడానికి పనికి రాకుండా పోతాయి. అందరూ కొబ్బరికాయ కొట్టాక ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అవి నీరు పడతాయి దానివల్ల వాటిని కూడా తినలేము. మరి ఎలా పాడుకాకుండా స్టోర్‌ చేయాలి? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి కాయల్లో ముదురు, లేత అని రెండు రకాలు ఉంటాయి. ముదురు కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేత కాయలు మాత్రం మూడు కళ్లు ఉన్న కుచ్చు వద్ద బూజు పట్టి పనికి రాకుండా పోతాయి. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే కొబ్బరి కాయలను ఒలిచిన తర్వాత కాయర్‌ (కొబ్బరి ముచ్చుక/పీచు) ఉన్న సైడ్‌ పైకి వచ్చేలా స్టోర్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే మూడు కళ్లు ఉన్న ప్రాంతానికి వాటర్ తగలకుండా చూసుకోవాలి. అలా చేస్తే కోకోనట్ 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది.

కొబ్బరి చెక్కలను కూడా కొన్ని టిప్స్ ద్వారా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సాధారణంగా దేవాలయాల్లో కొబ్బరికాయలను కొట్టిన తర్వాత ఆ ప్రసాదాలను ఇంటికి తెచ్చుకుంటారు కానీ వాటిని స్టోర్ చేయడం అనేది ఆడవాళ్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది ఇవి వెంటనే నీరు పట్టడం బూజు పట్టడం వంటి సమస్యలను ఫేస్ చేస్తాయి. మిగిలిన ఈ కొబ్బరి చిప్పలతో చట్నీలు చేయవచ్చని ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. లేదంటే తరిమిన కొబ్బరిని మిక్స్ చేయాలని అనుకుంటారు కానీ అవి రెండు రోజుల తర్వాత యూస్ చేయడానికి లేకుండా పోతాయి. అయితే కొబ్బరి చెక్కలను ఒక తెల్లటి గుడ్డలో కట్టి వాటిని నీటితో నింపిన గిన్నెలో పెడితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని చెబుతున్నారు.

అయితే ఈ నీటిని రెండు మూడు రోజులకు ఒకసారి పారబోసుకొని ఫ్రెష్ వాటర్‌తో రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇలాగే నల్లగొండలో చుట్టి నీటి గిన్నెలో స్టోర్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పలకు కొద్దిగా ఉప్పు రాసినా అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కవర్లో చుట్టి ఫ్రీజర్‌లో ఉంచడం ద్వారా కూడా కోకోనట్ పాడుకాకుండా కాపాడుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>