PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-freedom-fighters73025ea2-2af6-4916-8c31-4f82292c61e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-freedom-fighters73025ea2-2af6-4916-8c31-4f82292c61e0-415x250-IndiaHerald.jpgనేడు భారతీయులు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మువ్వన్నెల జెండా దేశవ్యాప్తంగా ప్రతి చోటా ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగ ఫలాన్ని ఎంతో భావోద్వేగంతో తలుచుకుంటున్నారు. అలాంటి గొప్ప దేశభక్తుల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని గుర్తు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. freedom fighters{#}eenadu;Varsham;Manam;Indians;Teluguరక్తంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ట్‌.. చూస్తే మతిపోతుంది..!రక్తంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ట్‌.. చూస్తే మతిపోతుంది..!freedom fighters{#}eenadu;Varsham;Manam;Indians;TeluguThu, 15 Aug 2024 11:50:38 GMTనేడు భారతీయులు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మువ్వన్నెల జెండా దేశవ్యాప్తంగా ప్రతి చోటా ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగ ఫలాన్ని ఎంతో భావోద్వేగంతో తలుచుకుంటున్నారు. అలాంటి గొప్ప దేశభక్తుల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని గుర్తు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు.

అయితే ఆర్టిస్టులు మాత్రం తమ ఆర్ట్‌ ద్వారా స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ చిత్రకళాకారుడు కోటేష్ స్వాతంత్య్ర దినోత్సవం రోజును పురస్కరించుకుని రక్తంతో ఒక ఆర్ట్ గీశారు. ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్ తమ రక్తం చిందించి దేశాన్ని బ్రిటిష్ వారి చెర నుంచి విడిపించారు. అలాంటి వారికోసం ఈనాడు రక్తం చిందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు కోటేష్. వీరి పైన ఎంతో గౌరవం, భక్తి ఉంటే తప్ప ఏ కళాకారుడు కూడా ఈ సాహసం చేయరనే చెప్పాలి. కోటేష్ ఓ A3 డ్రాయింగ్ షీట్ పై దాదాపు 240 మంది సమరయోధుల ముఖాలను చాలా పర్ఫెక్ట్ గా గీశారు. ఎందుకు ఆయన ఏకంగా ఐదు గంటల పాటు శ్రమించారు. ఇంత గొప్ప ఆర్టిస్టు మన తెలుగు వాడే కావడం మనందరికీ గర్వకారణం.

నంద్యాల పట్టణ వాసి అయిన కోటేష్ చిత్రలేఖనంతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈసారి కూడా వినూత్నమైన రీతిలో స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి తన దేశభక్తిని చాటారు. ఈ ఆర్ట్‌ను చూసిన వారందరూ వావ్, సూపర్ గా గీశారు సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ.. "ఎందరో వీరుల త్యాగాల కారణంగానే మనందరికీ స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై వీరులు పెద్ద యుద్ధమే చేశారు ఆ యుద్ధంలో ఎందరో అమరులయ్యారు. భావితరాల బాగోగుల కోసం వాళ్లు అవమానాలు, లాఠీ దెబ్బలు, కఠిన కారాకార శిక్షలు నిస్వార్ధంగా భరించారు. అలాంటి మహనీయుల కోసం ఈ రోజున నా రక్తంతో వారికి చిత్ర నివాళి అర్పించడం ఎంతో ఆనందంగా ఉంది." అని చెప్పుకొచ్చారు.కోటేష్ గీసిన చిత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ భరతమాత చూస్తున్నట్లు మనం గమనించవచ్చు. మనసును హత్తుకునే లాగా ఉంది. అందుకే చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమాలలో అనేక ఘటనలను కూడా చాలా బాగా గీశారు. జలియన్ వాలాబాగ్ సంఘటనను కూడా ఘటన అద్భుతంగా చిత్రీకరించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>