MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu857e4179-834e-4902-863b-bb48b7bc204e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu857e4179-834e-4902-863b-bb48b7bc204e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఘట్టమనేని కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. చిన్నతనంలోనే చాలా సినిమాలు చేసిన మహేష్ బాబు... తన తండ్రి కృష్ణ గారితో కూడా సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు... ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోగా దూసుకు వెళ్తున్నాడు. mahesh babu{#}kushi;mahesh babu;prince;Rajamouli;Kushi;Tirupati;Gautam Adani;Father;krishna;Yevaru;CBN;Hero;Cinemaకాలినడకన అలిపిరిలో మహేష్ బాబు ఫ్యామిలీ..!కాలినడకన అలిపిరిలో మహేష్ బాబు ఫ్యామిలీ..!mahesh babu{#}kushi;mahesh babu;prince;Rajamouli;Kushi;Tirupati;Gautam Adani;Father;krishna;Yevaru;CBN;Hero;CinemaThu, 15 Aug 2024 07:58:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఘట్టమనేని కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. చిన్నతనంలోనే చాలా సినిమాలు చేసిన మహేష్ బాబు... తన తండ్రి కృష్ణ గారితో కూడా సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు... ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోగా దూసుకు వెళ్తున్నాడు.

 
ఇదంతా పక్కకు పెడితే... ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం అసలు బయట ఎక్కడ కనిపించదు. చాలా గొప్ప్యంగా వాళ్ళ కుటుంబాన్ని... ఉంచుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఒకవేళ అనుకోకుండా బయటికి వస్తే ఫ్యాన్స్... మహేష్ బాబు కోసం ఎగబడతారు. మహేష్ కాకపోయినా ఆయన కుటుంబంలో ఎవరు కూడా జనాల కంటపడితే ఎగబడి మరీ సెల్ఫీలు అడుగుతారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా హీరో మహేష్ బాబు కుటుంబం తిరుమలకు వచ్చింది.

 

ఎవరైనా తిరుమలకు వస్తే ప్రత్యేకంగా.. వాహనాలతో తిరుమలకు చేరుకుంటారు. కానీ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం తాజాగా శ్రీవారిని దర్శించుకునేందుకు నడక మార్గాన్ని ఎంచుకుంది. అలిపిరి నడక మార్గంలో...  ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత, ఆయన పిల్లలు గౌతం అలాగే సితారా కూడా... చాలా కష్టపడి తిరుమల కొండ ఎక్కారు. తిరుమలకు చేరుకున్న అనంతరం శ్రీవారికి మొక్కులు అప్పగించారు.


అయితే మెట్టు మార్గంలో మహేష్ బాబు కుటుంబం... నడుస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎగబడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. వారితో నడిచి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. తిరుమలకు చేరుకున్న మహేష్ బాబు కుటుంబo... కొండపైన ఉన్న సుధా కృష్ణ నిలయం అతిథి గృహంలో బస చేయనున్నారు. కాగా ప్రిన్స్ మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
 








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>