PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-raithu-runamaafi-telanagana-tg-politics-congress69fd0dd3-ce6a-4833-9466-2a8ebf5bc0ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-raithu-runamaafi-telanagana-tg-politics-congress69fd0dd3-ce6a-4833-9466-2a8ebf5bc0ce-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల దగ్గరికి వస్తోంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్ కు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయి. ఇంకా మిగతా గ్యారెంటీల అమలుకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో రుణమాఫీ కూడా ఈరోజుతో పూర్తయింది. ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ గురించి మాట్లాడుతూనే మరో గ్యారంటీ గురించి తాజాగా మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో సంబరపడిపోతున్నారని, ప్రజలు భాREVANTH REDDY; RAITHU RUNAMAAFI; TELANAGANA; TG POLITICS; CONGRESS{#}swetha;American Samoa;revanth;Revanth Reddy;Telangana;Reddy;Congress;Government;sree;CM;Decemberతెలంగాణ: త్వరలో 7వ గ్యారంటీ అమలు చేస్తామన్న సీఎం రేవంత్.!తెలంగాణ: త్వరలో 7వ గ్యారంటీ అమలు చేస్తామన్న సీఎం రేవంత్.!REVANTH REDDY; RAITHU RUNAMAAFI; TELANAGANA; TG POLITICS; CONGRESS{#}swetha;American Samoa;revanth;Revanth Reddy;Telangana;Reddy;Congress;Government;sree;CM;DecemberThu, 15 Aug 2024 12:58:07 GMTతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  9 నెలల దగ్గరికి వస్తోంది.  ఇదే తరుణంలో కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్ కు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే  ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయి. ఇంకా మిగతా గ్యారెంటీల అమలుకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో రుణమాఫీ కూడా ఈరోజుతో పూర్తయింది. ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ గురించి మాట్లాడుతూనే మరో గ్యారంటీ గురించి తాజాగా మాట్లాడారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో సంబరపడిపోతున్నారని, ప్రజలు భావించిన విధంగా ప్రజాపాలన చేస్తున్నామని  అన్నారు.

 బీఆర్ఎస్ పాలనలో తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ లేదు.  మా పాలనలో తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛను అందించాం. మా పరిపాలనలో లోటుపాట్లు ఉంటే  ప్రజల సూచనలు సలహాలు స్వీకరించే అవకాశాలు కల్పించాం. అద్భుతమైన పాలన కోసం లోతైన సమీక్షలు చేసి ముందుకు సాగుతున్నాం. మెజారిటీ ప్రజల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తూ వస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు గడిచిన రాష్ట్ర గీతం లేని పరిస్థితుల్లో, ప్రముఖ కవి ఆంధ్ర శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని అన్నారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయిందని, గత పది సంవత్సరాలలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పదిరెట్లు పెరిగిందని అన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,500 కోట్ల రూపాయల అప్పు ఉంటే, గత డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని దానిపై మేము శ్వేతా పత్రం కూడా రిలీజ్ చేశామని అన్నారు. దయనీయ   పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలోనే అమెరికా  పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యామని అన్నారు. తక్కువ వడ్డీతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వాలని కోరామని తెలియజేశారు. ఈ విధంగా రేవంత్ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు   స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>