PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpb64fee7f-8310-4f9a-8f0a-d16a95589f8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpb64fee7f-8310-4f9a-8f0a-d16a95589f8d-415x250-IndiaHerald.jpgగత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా గెలిచేది తామే అని బలంగా నమ్మింది. జగన్ తో పాటు వైసీపీ మద్దతుదారులందరూ కూడా అదే విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చారు కానీ చివరికి కనీసం 15 సీట్లు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. దీంతో వైసీపీ కోసం పనిచేసిన అధికారులు కంగుతున్నారు. టిడిపి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైసీపీ విధేయులుగా పేరుగాంచిన పలువురు ఐపీఎస్ అధికారులను పదవుల నుంచి తొలగించారు. tdp{#}rana daggubati;sunil;Arrest;Jandhyala Ravishankar;Jagan;YCP;CBN;TDP;policeఆ ఐపీఎస్ ఆఫీసర్లకు వెరైటీ పనిష్మెంట్.. టీడీపీ ఇచ్చిపడేస్తోందిగా..ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు వెరైటీ పనిష్మెంట్.. టీడీపీ ఇచ్చిపడేస్తోందిగా..tdp{#}rana daggubati;sunil;Arrest;Jandhyala Ravishankar;Jagan;YCP;CBN;TDP;policeThu, 15 Aug 2024 11:30:00 GMT గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా గెలిచేది తామే అని బలంగా నమ్మింది. జగన్ తో పాటు వైసీపీ మద్దతుదారులందరూ కూడా అదే విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చారు కానీ చివరికి కనీసం 15 సీట్లు కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. దీంతో వైసీపీ కోసం పనిచేసిన అధికారులు కంగుతున్నారు. టిడిపి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైసీపీ విధేయులుగా పేరుగాంచిన పలువురు ఐపీఎస్ అధికారులను పదవుల నుంచి తొలగించారు.

ఈ అధికారులు గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేసి వేధించారు. ఇప్పుడు, 16 మందికి పైగా అధికారులు కొత్త కేటాయింపులు ఇంకా జరగలేదు ఇప్పుడు వాళ్లు వెయిటింగ్ స్టేటస్‌లో ఉన్నారు. అంతేకాదు వీరిపై టీడీపీ వెరైటీగా పగ తీర్చుకుంటోంది. రోజూ ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని డీజీపీ కార్యాలయంలో హాజరుకావాలని, వెయిటింగ్‌రూమ్‌లో హాజరు రిజిస్టర్‌పై సంతకం చేయాలని వారిని ఆదేశించింది

అధికారులు రోజూ కార్యాలయం నుంచి బయలుదేరే ముందు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేయాలి. డిజిపి అప్పగించిన ఏదైనా అత్యవసర పనులకు అందుబాటులో ఉండాలని వారికి చెప్పబడింది.  ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక పాత్రలు పోషించిన 16 మంది అధికారులు ఇప్పుడు టీడీపీ హయాంలో దిగజారిపోయే పరిస్థితి నెలకొంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి, మాజీ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఇప్పుడు వెయిటింగ్ స్టేటస్‌లో ఉన్నారు. కొల్లిని అన్ని పోస్టుల నుంచి తొలగించారు. పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయమని చెప్పారు. వెయిటింగ్‌లో ఇతర అధికారులు PV సునీల్ కుమార్, N. సంజయ్, కాంతి రాణా టాటా, G. పాల రాజు, Y. రవిశంకర్ రెడ్డి, K. రఘువీరా రెడ్డి. ఈ అధికారులు పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>