MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65dc9230-26d3-4a08-af67-0ed7feeff76d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65dc9230-26d3-4a08-af67-0ed7feeff76d-415x250-IndiaHerald.jpgమృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు మొత్తాన్ని ఆమె వైపుకు తిప్పుకుంది మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన 'హాయ్ నాన్న' కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌లో అవకాశాలు కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించి ఒక వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. మృణాల్ ఠాకూర్ tollywood{#}Telugu;Tollywood;Heroine;bollywood;Cinemaప్రభాస్ సినిమాకి నో చెప్పిన మృనాల్ ఠాగూర్.. కారణం తెలిస్తే షాక్..!?ప్రభాస్ సినిమాకి నో చెప్పిన మృనాల్ ఠాగూర్.. కారణం తెలిస్తే షాక్..!?tollywood{#}Telugu;Tollywood;Heroine;bollywood;CinemaThu, 15 Aug 2024 16:00:00 GMTమృణాల్ ఠాకూర్.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఒక్క సినిమాతోనే కుర్ర‌కారు మొత్తాన్ని ఆమె వైపుకు తిప్పుకుంది మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన 'హాయ్ నాన్న' కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌లో అవకాశాలు కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. ఆమెకు సంబంధించి ఒక వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. మృణాల్ ఠాకూర్ ప్ర‌భాస్‌తో క‌లిసి 'ఫౌజీ' సినిమాలో న‌టిస్తుంద‌ని తెలిసి

 అబ్బా కాంబినేష‌న్ సూప‌ర్ అంటూ ఆనంద‌ప‌డ్డారు. అయితే, ఆ వార్త‌ల‌పై మృణాల్ క్లారిటీ ఇచ్చి అంద‌రినీ డిస‌పాయింట్ చేసింది. తాను ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించ‌డం లేదంటూ తేల్చి చెప్పింది మృణాల్. ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ లో ముచ్చ‌టించిన ఆమె.. ఈ క్లారిటీ ఇచ్చింది. "మీరు ప్ర‌భాస్‌తో క‌లిసి 'ఫౌజీ'లో న‌టిస్తున్నారా?" అని అడిగిన ప్ర‌శ్న‌కి "సారీ.. నేను ఆ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డం లేదు" అంటూ స‌మాధానం చెప్పారు మృణాల్. ప్రస్తుతం తన ఫోకస్ అంతా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కూడా మృణాల్ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

 ఇస్తుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో ఎందరో హీరోయిన్స్ ఇలా బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలకు నో చెప్పి చివరికి సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. 'ఫౌజీ' షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. క‌ల‌క‌త్తా, హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సుభాస్ చంద్ర‌బోస్ మీద ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇటీవ‌ల రిలీజైన ప్ర‌భాస్' కల్కీ 2898 ఏడీ' సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>