Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/video-viral9ddbb096-b70d-4363-81f4-05d7ca58343c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/video-viral9ddbb096-b70d-4363-81f4-05d7ca58343c-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చాలామంది రీల్స్ మోజులో పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టెర్రస్, జలపాతాలు, లోయలు, బిజీ రోడ్స్, రైల్వే ట్రాక్స్‌, వెహికల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోతున్నారు. ఈ రీల్స్ చేయడం వల్ల వారికి ఒరిగేది ఏమీ లేదు. ఈ మోజు అనేది వారి జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు కూడా రీల్స్ చేస్తూ చివరికి ఘోర యాకvideo viral{#}Accident;Car;Girl;Bike;wednesdayఉత్తరప్రదేశ్: రీల్స్ చేస్తుండగా.. అతివేగంతో వచ్చి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..!ఉత్తరప్రదేశ్: రీల్స్ చేస్తుండగా.. అతివేగంతో వచ్చి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..!video viral{#}Accident;Car;Girl;Bike;wednesdayThu, 15 Aug 2024 16:30:00 GMTఇటీవల కాలంలో చాలామంది రీల్స్ మోజులో పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టెర్రస్, జలపాతాలు, లోయలు, బిజీ రోడ్స్, రైల్వే ట్రాక్స్‌, వెహికల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరికొంతమంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోతున్నారు. ఈ రీల్స్ చేయడం వల్ల వారికి ఒరిగేది ఏమీ లేదు. ఈ మోజు అనేది వారి జీవితాలను నాశనం చేస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు కూడా రీల్స్ చేస్తూ చివరికి ఘోర యాక్సిడెంట్ కి గురయ్యారు.

బిజ్నోర్‌లోని కిరత్‌పూర్ ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. రీల్ కోసం నలుగురు యువకులు బిజీ రోడ్డు పైకి వెళ్లారు. ఓ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు సడన్ గా రోడ్డుపై లేన్ చేంజ్ చేశారు. అదే లేన్‌లో చాలా వేగంగా వస్తున్న కారు వీరిని వేగం గా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సమర్‌, నోమాన్ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జాతీయ రహదారి 34పై బుధవారం జరిగింది. ముందలా గ్రామానికి చెందిన ఈ ఇద్దరు యువకులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు మరల్చుకుంటున్న సమయంలో వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా భీకరం. ఇద్దరూ బైక్ నుంచి గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. ఆ వీడియోలో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తున్నారు. అకస్మాత్తుగా వారు రోడ్డు మధ్యలో తిరిగారు. అప్పుడే వెనుక నుంచి వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటన కేవలం 8 సెకన్లలో జరిగింది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది.

ప్రస్తుతం ఇద్దరు బాధితులకు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక పాఠం కావాలని చాలామంది నెటిజన్లు కోరుతున్నారు. బిజీ రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. వైపు ఇటు అలా ఒక పదహారేళ్ల అమ్మాయి టెర్రస్ పైన రీల్స్ తీస్తూ ఆరవ అంతస్తు పైనుంచి కింద పడింది. మొక్కపై పడటం వల్ల ఆమె చనిపోకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ కాలు మాత్రం విరిగింది. ఈ https://x.com/sirajnoorani/status/1823631657892470930?t=_FkVZzT2ODg7Izmro6JcYQ&s=19 లింకుపై క్లిక్ చేసి వీడియోని చూడవచ్చు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>