PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh58bceb1f-f627-4999-8bc3-0d42a611c0ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh58bceb1f-f627-4999-8bc3-0d42a611c0ea-415x250-IndiaHerald.jpgదాదాపు అధికార పార్టీలు అన్నింటికీ బలంగా కొమ్ముకాసే మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, మీడియాను అస్సలు వేరుచేసి చూడలేం. ఇక్కడ పచ్చ మీడియా, బులుగు మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అంటూ రకరకాలుగా విడిపోయాయి. ఇక వైసిపి వాళ్లు పదేపదే పచ్చ మీడియా అని కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటారు.nara lokesh{#}advertisement;Lokesh;Jagan;YCP;Telugu Desam Party;Minister;Government;Andhra Pradesh;Teluguలోకేష్‌కు... ఆ మీడియాధినేత‌తో పెద్ద గొడ‌వ‌... నో అపాయింట్‌మెట్‌...?లోకేష్‌కు... ఆ మీడియాధినేత‌తో పెద్ద గొడ‌వ‌... నో అపాయింట్‌మెట్‌...?nara lokesh{#}advertisement;Lokesh;Jagan;YCP;Telugu Desam Party;Minister;Government;Andhra Pradesh;TeluguWed, 14 Aug 2024 15:44:49 GMTరెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు మీడియా రెండుగా చీలిపోయింది. తెలుగు మీడియాలో కొన్ని సంస్థలు, కొన్ని ఛానల్‌లు ఒక పార్టీకి కొమ్ముకాస్తూ ఉంటే.. మరికొన్ని సంస్థలు, మరికొన్ని ఛానళ్లు మరో పార్టీకి కొమ్ము కాయటం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు అధికార పార్టీలు అన్నింటికీ బలంగా కొమ్ముకాసే మీడియా సంస్థలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, మీడియాను అస్సలు వేరుచేసి చూడలేం. ఇక్కడ పచ్చ మీడియా, బులుగు మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అంటూ రకరకాలుగా విడిపోయాయి. ఇక వైసిపి వాళ్లు పదేపదే పచ్చ మీడియా అని కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటారు.


వైసిపి అధినేత జగన్ కూడా ఇదే తరహా విమర్శలు ఎప్పటినుంచో చేస్తూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవి, మహా టీవీ, హెచ్ఎంటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంస్థలపై వైసిపి వాళ్ళు ఎప్పుడు పచ్చ మీడియా అని విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో ఎఫెక్ట్ గా పని చేసే ఒక మీడియా అధినేతకు.. తెలుగుదేశం యువనేత మంత్రి నారా లోకేష్‌కు మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసిందని.. ఇది ముదిరి పాకాన పడిందని.. కొందరు పెద్దలు సైతం ఈ గ్యాప్ పూడ్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది. గత నాలుగు నెలల నుంచి ఈ గొడవ పెరిగి పెద్దది అవుతూ వస్తోందని.. చివరకు ఎన్నికల టైం లో కూడా ఆ మీడియా అధినేత సిఫార్సులతో పాటు.. ఆ సంస్థకు పార్టీ నుంచి ఇచ్చే వాణిజ్య ప్రకటనలు సైతం భారీగా తగ్గించేసినట్టు తెలుస్తోంది.


ఇందుకు సదర మీడియానేత చేసిన ఓవర్ యాక్షన్ కూడా కొంత కారణమని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. అధికారం లేనప్పుడు ఒకలా.. సదరు మీడియా అధినేత వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి లోకేష్ కు చేరాయి. దీంతో లోకేష్ ఎన్నికలకు ముందు నుంచే ఆ మీడియా అధినేతను ఆ మీడియా సంస్థలను పక్కన పెడుతూ వస్తున్నారని తెలుస్తోంది. చివరకు ఆ మీడియానేత లోకేష్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే కూడా.. ఇవ్వ‌ని పరిస్థితి ఉందన్న చర్చ ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో గట్టిగా నడుస్తోంది. అందుకే ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు వచ్చే ఆ మీడియాలో.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే.. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తున్నాయి అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>