PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao7bdbc96e-a02d-4997-8f6d-314d34091ad5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao7bdbc96e-a02d-4997-8f6d-314d34091ad5-415x250-IndiaHerald.jpgఎంతోమంది నేతలను ఎదగకుండా హరీష్ రావు అడ్డంగా తొక్కేస్తూ వచ్చారు. రఘునందన్ లాంటి నాయకుడు మరో పార్టీలో ఉండి ఉంటే ఎప్పుడో మంత్రి అవడంతో పాటు.. తెలంగాణ రాజకీయాలలో కీలకంగా ఉండేవారు. ఒకే సామాజిక వర్గం కావడంతో పాటు.. తనకంటే బలమైన వాగ్దాటి ఉన్న రఘునందన్ రావు.. తన రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని.. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నానా ఇబ్బందులు క్రియేట్ చేశారు.harish rao{#}CMప‌వ‌ర్‌.. ప‌రువు పోయాయి.. హ‌రీష్‌రావు ప్ర‌స్టేష‌న్‌..?ప‌వ‌ర్‌.. ప‌రువు పోయాయి.. హ‌రీష్‌రావు ప్ర‌స్టేష‌న్‌..?harish rao{#}CMWed, 14 Aug 2024 15:55:52 GMTతెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు పైకి చాలా సుద్దులు, కబుర్లు చెబుతూ ఉంటారే కానీ.. ఆయన కనపడని కుళ్ళు రాజకీయం చేస్తారని బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు చాలామంది చెబుతూ ఉంటారు. ఎంతోమంది నేతలను ఎదగకుండా హరీష్ రావు అడ్డంగా తొక్కేస్తూ వచ్చారు. రఘునందన్ లాంటి నాయకుడు మరో పార్టీలో ఉండి ఉంటే ఎప్పుడో మంత్రి అవడంతో పాటు.. తెలంగాణ రాజకీయాలలో కీలకంగా ఉండేవారు. ఒకే సామాజిక వర్గం కావడంతో పాటు.. తనకంటే బలమైన వాగ్దాటి ఉన్న రఘునందన్ రావు.. తన రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో అని.. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నానా ఇబ్బందులు క్రియేట్ చేశారు.


రఘునందన్ రావు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఓడిపోవడం వెనక హరీష్ రావు హస్తం ఉందని.. స్వయంగా ఆరోపించారు. చివరకు రాష్ట్రం ఏర్పడ్డాక.. రఘునందన్‌కు సీటు లేదని చెప్పడంతో ఆయన బిజెపిలో చేరారు. అధికారం ఉన్నప్పుడు అధికారం అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన హరీష్ రావు.. ఇప్పుడు పవర్ పోయాక పార్టీలో ఆయన స్థానం పూర్తిగా దిగజారి పరువు కూడా పోతుంది. ఈ ప్రెస్టేషన్‌లో ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంపై క్రెడిట్ పంచాయతీ ముదిరింది.


ప్రాజెక్ట్‌ ట్రైలర్ పూర్తయిన నేపథ్యంలో.. హరీష్ రావు చేసిన విమర్శలు ఖమ్మం జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. మంత్రులంతా క్రెడిట్ కోసం వెళుతున్నారని ఆగస్టు 15న సీఎం కూడా వెళతారని హరీష్ రావు విమర్శించారు. దీనిపై మంత్రి తుమ్మల తీవ్రంగా స్పందించారు. తాను ఏనాడు క్రెడిట్ కోసం పాల్గొనడం లేదని.. ప్రజల కోసం తపన పడ్డానని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తను ఎన్నో ప్రాజెక్టులలో భాగం పంచుకున్నారని.. ఖమ్మం జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని తపన పడ్డారని.. స్పష్టం చేశారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. హరీష్ రావుకి.. పవర్ పోయి వారసత్వపోరులో వెనుకబడి పరువు కూడా పోయిందని.. ఇప్పుడు ప్రస్తుతం తుమ్మలపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>