PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka73f81957-9544-4d02-8495-e3bfcf30c2e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viveka73f81957-9544-4d02-8495-e3bfcf30c2e6-415x250-IndiaHerald.jpg కూటమిలో జనసేన, బిజెపి భాగస్వామిగా ఉన్నాయి. పైగా అటు కేంద్రంలోనూ.. ఈ మూడు పార్టీలు కలిసి అధికార పార్టీలో ఉన్నాయి. అక్కడ బిజెపి నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష వైసిపికి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. viveka{#}kadapa;Y S Vivekananda Reddy;CBN;Telugu Desam Party;Jagan;TDP;YCP;MLA;CMవివేకాను ఓడించినోళ్లు.. బొత్స‌ను ఓడించ‌లేరా... బాబు ప‌లాయ‌నం వెన‌క‌..?వివేకాను ఓడించినోళ్లు.. బొత్స‌ను ఓడించ‌లేరా... బాబు ప‌లాయ‌నం వెన‌క‌..?viveka{#}kadapa;Y S Vivekananda Reddy;CBN;Telugu Desam Party;Jagan;TDP;YCP;MLA;CMWed, 14 Aug 2024 12:55:58 GMTనెలల క్రితం భారీ మెజార్టీతో, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమిలో జనసేన, బిజెపి భాగస్వామిగా ఉన్నాయి. పైగా అటు కేంద్రంలోనూ.. ఈ మూడు పార్టీలు కలిసి అధికార పార్టీలో ఉన్నాయి. అక్కడ బిజెపి నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష వైసిపికి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైసిపి నుంచి ముందుగా మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స‌ సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధినేత జగన్ వారం రోజుల కిందటే ప్రకటించారు.

కూటమి పార్టీలు పోటీ చేస్తాయి అని.. అభ్యర్థిని ప్రకటిస్తాయి అని.. కచ్చితంగా గెలుస్తామని.. పైగా టిడిపి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇటు బిజెపి నుంచి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.. చక్రాలు తిప్పేస్తారని.. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ సీటు టీడీపీ ఖాతాలో పడుతుందని ఒక్కటే ప్రచారం ఊదర‌గొట్టారు. అయితే నామినేషన్ల దాఖలకు చివరి రోజున చంద్రబాబు చేతులు ఎత్తేశారు. విచిత్రం ఏంటంటే ఏడు సంవత్సరాల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. నాడు కడప జిల్లా స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరిగింది.


అప్పుడు వైసిపి నుంచి స్వయంగా జగన్ బాబాయ్ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేశారు. కానీ.. ఆ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి.. బీటెక్ రవి, సీఎం రమేష్ లాంటి వాళ్ళను ఇన్చార్జిలుగా పెట్టి కోట్లాది రూపాయల కుమ్మరించి విజయం సాధించింది. అప్పుడు బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచారు. అంత పోరాటం చేసి జగన్ సొంత జిల్లాలో వైసీపీకి మెజార్టీ ఉన్న.. విజయం సాధించిన చంద్రబాబు.. ఇప్పుడు విశాఖ ఉప ఎన్నిక విషయంలో ఎందుకు చొరవ చూపలేదు..? తాము ఎంత చేసిన ఓడిపోతాం అన్న డౌట్ ఆయన మనసులో ఉందా...? అన్నది కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను సైతం ఎంతో ఆశ్చర్యపరిచిందని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>