PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-chairman839d4e0e-c92b-4a1d-a911-16f43651a8c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-chairman839d4e0e-c92b-4a1d-a911-16f43651a8c0-415x250-IndiaHerald.jpg కొంతమంది రాజకీయ నాయకులయితే తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా ఈ పదవి చేపట్టాలని ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పదవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి దక్కుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. మామూలుగా చూస్తే టీటీడీ చైర్మన్ పద‌వి ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు. TTD chairman{#}Uttarandhra;Tirupati;Tirumala Tirupathi Devasthanam;Godavari River;Telugu Desam Party;Andhra Pradeshటీటీడీ చైర్మ‌న్ ఈ సారి వాళ్ల‌కేనా... ఫిక్స్ అయిన చంద్ర‌బాబు..?టీటీడీ చైర్మ‌న్ ఈ సారి వాళ్ల‌కేనా... ఫిక్స్ అయిన చంద్ర‌బాబు..?TTD chairman{#}Uttarandhra;Tirupati;Tirumala Tirupathi Devasthanam;Godavari River;Telugu Desam Party;Andhra PradeshWed, 14 Aug 2024 13:08:10 GMTతిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎంత ప్రతిష్టాత్మకం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పదవి కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులయితే తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా ఈ పదవి చేపట్టాలని ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పదవి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి దక్కుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. మామూలుగా చూస్తే టీటీడీ చైర్మన్ పద‌వి ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కలేదు. గోదావరి జిల్లాల వరకు వచ్చి ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు రెండుసార్లు టీటీడీ చైర్మన్గా పనిచేశారు.


అయితే ఈసారి అనూహ్యంగా టిటిడి చైర్మన్ పదవి రేసులో ఉత్తరంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత రేసులో బలంగా ఉన్నారు. ఆయన ఎవరో కాదు మాజీ ఏపీ ప్రెసిడెంట్, మాజీ హోం మంత్రి.. కిమిడి కళా వెంకట్రావు. కళా వెంకట్రావు 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈసారి గెలిచి కచ్చితంగా మంత్రి అవుదాం అనుకున్నారు. అసలు చివరి వరకు ఆయనకు టికెట్ వస్తుందో.. రాదో.. అన్న డౌటు ఉంది. బిజెపికి ఇవ్వడంతో చివర్లో కళాకు చీపురుపల్లి సీటు ఇచ్చారు.


అక్కడ ఆయన.. బొత్స సత్యనారాయణ పై సంచలన విజయం సాధించారు. ఇక ఉత్తర ఆంధ్ర‌ నుంచే టిటిడి బోర్డు మెంబర్ పదవిని.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్ కి ఇస్తారని మరో ప్రచారం సాగుతోంది. ఆయన కూడా బలమైన బీసీ నేత. మంత్రి పదవి ఆశించారు. ఏది ఏమైనా ఉత్తరంధ్ర నుంచి కళా వెంకట్రావు టీటీడీ చైర్మన్ రేసులో ఉండటం.. ఆయన బీసీ కావడంతో.. ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ఉంది. అలాగే టీవీ 5 న్యూస్ ఛానెల్‌ చైర్మన్ బిటి నాయుడు పేరు కూడా టిటిడి చైర్మన్ రేసులో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>