PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress7516762f-c46c-47de-aa6e-fa8b48e2c1d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/congress7516762f-c46c-47de-aa6e-fa8b48e2c1d0-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గం ఇప్పుడు అధికార పార్టీ తరపున రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పాలక ప్రతిపక్షాల మధ్య ఉండే ప్రోటోకాల్ వార్ ఇక్కడ అధికారపక్షాల మధ్య అగ్గి రాజేసుకుంటుంది. ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య వర్గపోరు కొత్త ఏమీ కాకపోయినా.... అది ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. congress{#}Mahbubnagar;Wanaparthy;war;bus;politics;Jr NTR;Cabinet;local language;MLA;Party;Congress;policeరేవంత్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి..ఇది టీడీపీ కాదు..కాంగ్రెస్ ?రేవంత్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి..ఇది టీడీపీ కాదు..కాంగ్రెస్ ?congress{#}Mahbubnagar;Wanaparthy;war;bus;politics;Jr NTR;Cabinet;local language;MLA;Party;Congress;policeWed, 14 Aug 2024 08:04:34 GMT
రేవంత్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గం ఇప్పుడు అధికార పార్టీ తరపున రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పాలక ప్రతిపక్షాల మధ్య ఉండే ప్రోటోకాల్ వార్ ఇక్కడ అధికారపక్షాల మధ్య అగ్గి రాజేసుకుంటుంది. ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య వర్గపోరు కొత్త ఏమీ కాకపోయినా.... అది ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది.


నియోజకవర్గంలో ఆటు ప్రభుత్వ కార్యక్రమం అయినా, ఇటు పార్టీ కార్యక్రమం అయినా ఇద్దరు లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అవుతోంది. సీనియర్, జూనియర్ నాయకుల మధ్య జరుగుతున్న గొడవ రూలింగ్ పార్టీ క్యాడర్ ను అయోమయంలో గురిచేస్తుందట. వనపర్తిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో పేరున్న నాయకుడు చిన్నారెడ్డి. అయితే పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందించారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మేఘారెడ్డికి అవకాశం ఇచ్చింది అధిష్టానం. దీనిపై హై కమాండ్ సర్ది చెప్పడంతో చిన్నారెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే అనూహ్యంగా మేఘారెడ్డి గెలవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితులను మార్చేశాయి.


చిన్నారెడ్డి ఎంత సీనియర్ నేత అయినప్పటికీ తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అని అంటున్నారు మేఘారెడ్డి. నువ్వు సిట్టింగ్ అయితే నేను హై కమాండ్ కి దగ్గర అంటున్నారు చిన్నారెడ్డి. ఏ చిన్న కార్యక్రమంలోనైనా ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఈ వరుస పరిణామాలు పార్టీ క్యాడర్ నే కాకుండా ఇటు అధికారులను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. మర్రికొండ నుంచి గోపాలపేట వరకు బస్సు సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి చిన్నారెడ్డి మేఘారెడ్డి మధ్య వర్గపోరు బయటపడింది. గతంలో అదే బస్సు సర్వీసును ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించే ప్రయత్నం చేశారు.

 
నాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి లేరన్న కారణంతో వాయిదా పడింది. అనంతరం కొద్దిరోజులకి ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే బస్సు సర్వీసును ఒక్కరే ప్రారంభించారు. దీంతో విషయం తెలుసుకున్న చిన్నారెడ్డి అనుచరులు తమ నాయకుడు అందులోను క్యాబినెట్ హోదా కలిగిన నేత లేకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేస్తే గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అలా ఓ బస్సు సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంలోనూ ఇలా వర్గపోరు బగ్గుమనడం....నేతలు, కార్యకర్తలు రోడ్డుకి ఎక్కడం అధికారపార్టీని షాకింగ్ కి గురిచేస్తుందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>