PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn2c5f45e3-c6b1-4f76-a8d7-9f6debe2fe2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn2c5f45e3-c6b1-4f76-a8d7-9f6debe2fe2c-415x250-IndiaHerald.jpg విశాఖపట్నం జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి.. వాస్తవానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఇక్కడ నుంచి గతంలో వైసిపి తరఫున గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ కొట్టి.. విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక‌ జరిగింది.CBN{#}politics;TDP;CBN;BOTCHA SATYANARAYANA;Jaganచంద్ర‌బాబు ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డ్డారా...?చంద్ర‌బాబు ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డ్డారా...?CBN{#}politics;TDP;CBN;BOTCHA SATYANARAYANA;JaganWed, 14 Aug 2024 16:10:50 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భయపడ్డారా..? విపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్‌కు పెద్ద టెన్షన్ తప్పించారా..? అంటే అవుననే చెప్పాలి. విశాఖపట్నం జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి.. వాస్తవానికి ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఇక్కడ నుంచి గతంలో వైసిపి తరఫున గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ కొట్టి.. విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక‌ జరిగింది.


జగన్ ముందుగా వ్యూహాత్మకంగా మాజీ మంత్రి.. పార్టీ సీనియర్ నేత బొత్స‌ సత్యనారాయణకు ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పారు. బొత్స ఇక్కడ పోటీ చేయడంతో పాటు.. ముందు నుంచి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను.. క్యాంపులకు తరలించారు. ఇక కూటమి పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారో..? అన్నదానిపై పెద్ద సస్పెన్స్ నడిచింది. చంద్రబాబు ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే.. మొత్తం 838 ఓటర్లు ఉన్నారు.


ఇందులో ఎవరు విజయం సాధించాలి..? అన్న కనీసం 420 ఓట్లు రావాల్సి ఉంది. వాస్తవంగా చూస్తే కూటమిలో మూడు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కేవలం 230 మాత్రమే ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత 100 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారారనుకున్న కూటమి బలం 330 మాత్రమే ఉంది. ఇప్పుడు పోటీ చేసి ఓడిపోతే పరువు పోతుందని భావించిన చంద్రబాబు ఇక్కడ కూటమి అభ్యర్థిని పోటీకి పెట్టలేదు. ఈ క్రమంలోనే హుందా రాజకీయాలు అంటూ.. చాలా తెలివిగా తప్పించుకున్నారు అని చెప్పాలి. ఏది ఏమైనా అంతిమంగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి లేకుండానే వైసిపి విజయం సాధించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>