MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin86677fa3-c50a-48db-81b1-4c0dec56b065-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin86677fa3-c50a-48db-81b1-4c0dec56b065-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు మంచి హిట్ పడటం లేదు. అందుకోసమే ఆయన కొత్త కథలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రాబిన్ హుడ్ అనే మూవీని నితిన్ చేస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు అనే మూవీని నితిన్ చేయనున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ మూవీ తర్వాత నితిన్ ఏ డైరెక్టర్‌తో మూవీ చేస్తాడనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే బలగం మూవీ సూపర్ హిట్nithin{#}Nani;dil raju;srikanth;sujeeth;December;Saturday;Comedian;Viswak sen;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Audience;Venu Thottempudi;Tollywood;Rocky;Cinema;Director;Hero;Newsఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి హీరో నితిన్ దగ్గరికి చేరిన వేణు కథఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి హీరో నితిన్ దగ్గరికి చేరిన వేణు కథnithin{#}Nani;dil raju;srikanth;sujeeth;December;Saturday;Comedian;Viswak sen;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Audience;Venu Thottempudi;Tollywood;Rocky;Cinema;Director;Hero;NewsWed, 14 Aug 2024 08:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు మంచి హిట్ పడటం లేదు. అందుకోసమే ఆయన కొత్త కథలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రాబిన్ హుడ్ అనే మూవీని నితిన్ చేస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదిన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తమ్ముడు అనే మూవీని నితిన్ చేయనున్నాడు. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ మూవీ తర్వాత నితిన్ ఏ డైరెక్టర్‌తో మూవీ చేస్తాడనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే బలగం మూవీ సూపర్ హిట్ కొట్టిన కమెడియన్ వేణు తన రెండో ప్రాజెక్టును నితిన్‌తో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును వేణు నేచురల్ స్టార్ నానితో చేయాలనుకున్నారట.

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం చేస్తున్నాడు. దాని తర్వాత శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్‌లో ఇంకో సినిమా ఉంటుంది. దాంతో పాటు హిట్2 మూవీ స్క్రిప్ట్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. అదీ అయిపోతే సుజిత్ డైరెక్షన్‌లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలు ఉండటంతో వేణు మూవీని నాని రిజెక్ట్ చేశారట. దీంతో వేణు టాలీవుడ్ మరో హీరో అయిన విశ్వక్ సేన్‌పై పడింది.

అయితే విశ్వక్ సేన్ కూడా మెకానిక్ రాకీ మూవీ తర్వాత డైరెక్టర్ కృష్ణచైతన్యతో ఓ సినిమా చేస్తున్నారట. దాని తర్వాత ఇంకో సినిమాకు కూడా కమిట్ అయ్యారట. దీంతో విశ్వక్ సేన్‌తో కూడా వేణు సినిమా ఉండదని తెలిసింది. ఇక తమ్ముడు మూవీ చేసిన తర్వాత నితిన్ చేతిలో పెద్ద ప్రాజెక్ట్ ఏదీ లేదు. కాబట్టి బలగం వేణు తన ప్రాజెక్ట్‌ను ముందు అనుకున్న విధంగానే నితిన్‌తో చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఆ కథ అటుఇటూ చేరి ఆఖరికి నితిన్ దగ్గరికే వచ్చి ఆగింది. దిల్ రాజు నిర్మించే ఈ మూవీ కమర్షియల్ యాక్షన్ జోనర్‌లో సాగనుందని టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>