PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb3e13893-3304-4755-a792-acb701a6e7f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpb3e13893-3304-4755-a792-acb701a6e7f2-415x250-IndiaHerald.jpgటీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వైసిపి హయాంలో ఎవరైతే టీడీపీని టార్గెట్ చేశారో, అలాగే ఆక్రమాలకు పాల్పడ్డారో వారిని అరెస్టులు చేస్తున్నారు. అప్పట్లో రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు అరెస్టులకు రెడీ అయిపోవాల్సిందేనని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు అప్పట్లో ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఒక నిందితుడిలా ఉన్నారు. చంద్రబాబు ఇంటి మీద అటాక్ అనంతరం జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారనే ఒక టycp{#}Amarnath Cave Temple;JOGI RAMESH;రాజీనామా;K E Krishnamurthy;gannavaram;Anti-Corruption Bureau;Macherla;Arrest;MP;Letter;Service;Andhra Pradesh;CBN;MLA;India;CM;Minister;Wife;police;YCP;TDPవైసీపీకి చేదు: వరుస అరెస్టులతో వైసీపీ నేతలు గజగజ.. కేసులకు లెక్కేలేదు..?వైసీపీకి చేదు: వరుస అరెస్టులతో వైసీపీ నేతలు గజగజ.. కేసులకు లెక్కేలేదు..?ycp{#}Amarnath Cave Temple;JOGI RAMESH;రాజీనామా;K E Krishnamurthy;gannavaram;Anti-Corruption Bureau;Macherla;Arrest;MP;Letter;Service;Andhra Pradesh;CBN;MLA;India;CM;Minister;Wife;police;YCP;TDPWed, 14 Aug 2024 07:05:00 GMT* టీడీపీ ఓటమే వైసీపీ నేతలకు శాపం అయ్యిందా

* ఇప్పటికే ముగ్గురు వైసీపీ నేతలు అరెస్ట్  

* అంతేలేకుండా పెరిగిపోతున్న కేసులు

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. వైసిపి హయాంలో ఎవరైతే టీడీపీని టార్గెట్ చేశారో, అలాగే ఆక్రమాలకు పాల్పడ్డారో వారిని అరెస్టులు చేస్తున్నారు. అప్పట్లో రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు అరెస్టులకు రెడీ అయిపోవాల్సిందేనని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు అప్పట్లో ఒక కేసు ఫైల్ అయింది. ఆ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఒక నిందితుడిలా ఉన్నారు. చంద్రబాబు ఇంటి మీద అటాక్ అనంతరం జోగి రమేష్‌కు మంత్రి పదవి ఇచ్చారనే ఒక టాక్‌ ఉంది. అయితే అతన్ని ఇప్పుడు టీడీపీ బాగా టార్గెట్ చేస్తోంది.

అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా తమ పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని జోగి కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నడుమ జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి షాకిచ్చారు. జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయి కూడా భూకబ్జా వ్యవహారంలో ప్రమేయం ఉందని కేసులో పేర్కొన్నారు. నెక్స్ట్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు జైలు పాలు కానున్నారని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో వీళ్లు టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుకున్నారు. ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నట్లుగా టీడీపీ నేతలు వారిని టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అందువల్ల వారిని అరెస్టు చేయడం పెద్ద విషయం కాదని తెలుస్తోంది.

తన ఇంట్లో పని చేసే బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదివరకే అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇక ఫైల్ అవుతున్న కేసులకు లెక్కే లేదు. వైసీపీ నేతలపై రోజు ఎక్కడ ఒకచోట కేసు ఫైల్ అవుతూనే ఉంది. వాటిలో కొన్ని తెలుసుకుందాం పదండి. టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు సహా ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుపై కేసు నమోదు చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆమె తన భార్య వాణిని కాదని మరో మహిళ మాధురితో అఫైర్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అయింది. మచిలీపట్నం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా ఒక కేసు ఫైల్ అయింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వాలంటీర్ల ఫిర్యాదు చేయగా ఈ కేసును పోలీసులు ఫైల్ చేశారు. పుంగనూరులో పర్యటన చేపట్టి ఉద్రిక్తతలకు దారితీశారంటూ టీడీపీ నేత సుహేల్ భాషా ఫిర్యాదు చేయగా.. వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ లక్షల రూపాయలకు అక్రమంగా అమ్మాడంటూ వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై మునిసిపాలిటీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>