Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sneham-kosam-bunny-denikaina-edureltaduc0f72900-0814-4209-8166-7b8b513eba29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sneham-kosam-bunny-denikaina-edureltaduc0f72900-0814-4209-8166-7b8b513eba29-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుప్ప-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమాకు బాలీవుడ్ ఫిదా అయింది. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్‌కు బాలీవుడ్ జనాలు నీరాజనం పట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయిలకు పైగానే కలెక్ట్ చేసింది.ఈ సినిమాకు కొనసాగింపుగా పుప్ప-2 తెరకెక్కుతోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా , షూటింగ్ ఆలస్socialstars lifestyle{#}sukumar;kushi;Kushi;Allu Sneha;producer;Producer;Father;Allu Arjun;India;Car;Cinema;bollywoodబన్నీ వాసు : స్నేహం కోసం బన్నీ దేనికైనా ఎదురెళ్తారు..!!బన్నీ వాసు : స్నేహం కోసం బన్నీ దేనికైనా ఎదురెళ్తారు..!!socialstars lifestyle{#}sukumar;kushi;Kushi;Allu Sneha;producer;Producer;Father;Allu Arjun;India;Car;Cinema;bollywoodWed, 14 Aug 2024 13:18:23 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుప్ప-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప సినిమాకు బాలీవుడ్ ఫిదా అయింది. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్‌కు బాలీవుడ్ జనాలు నీరాజనం పట్టారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయిలకు పైగానే కలెక్ట్ చేసింది.ఈ సినిమాకు కొనసాగింపుగా పుప్ప-2 తెరకెక్కుతోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా , షూటింగ్ ఆలస్యం కావడంతో చిత్ర యూనిట్ డిసెంబర్‌కు వాయిదా వేశారు.ఇదిలావుంటే నిర్మాత బన్నీ వాసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న స్నేహ బంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం బన్నీనే అని వెల్లడించారు.పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన హై వోల్టేజ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. పుష్ప మూవీలో చేసిన నటనకు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఫ్రెండ్ షిప్ కు ఎంతో వాల్యూ ఇస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్నేహితులకు అండగా నిలుస్తారు. అల్లు అర్జున్ ఫ్రెండ్ షిప్ పై ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ స్నేహం అలా ఉంటుందంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే వ్యక్తి అల్లు అర్జున్‌పై అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఆయ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బన్నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. "నాకు ఒకటే ధైర్యం ఎప్పుడూ. నా లైఫ్‌లో ఒకరు ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉందంటే మాత్రం ఆయన వచ్చి నిలబడతారు.నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరే ఇద్దరు నన్ను గుర్తుపట్టేస్తారు. ఒకరు మా అమ్మ. రెండో వ్యక్తి అల్లు అర్జున్‌. నేను ఆయనను అడగవసరం లేదు. నా అవసరాన్ని ముందే గుర్తించి చేస్తారు ఆయన. ఆయ్‌ సినిమా పబ్లిసిటీ లేదు. అల్లు అర్జున్‌ గారితో ఓపోస్ట్ వేయించమని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కానీ అది నేను అడగాల్సిన అవసరం లేకుండానే, వీడికి అవసరం ఉందని ఆయనకు తట్టింది.

వెంటనే ఈ రోజు (ఆగష్టు 13) ఉదయం 11 గంటలకు ఆయ్‌ మూవీ గురించి పోస్ట్ చేశారు. అది బన్నీ అంటే. ఒక స్నేహితుడి కోసం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలబడతారు. నాకు ఎలాంటి కష్టం వచ్చిన ఆయన ముందుంటారు.అలాంటి మంచి వ్యక్తి జీవితంలో ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే "జానీ సినిమాకు యానిమేటర్ పని చేసిన తను ఇప్పుడు ఓ సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం, గీతా ఆర్ట్స్‌లో భాగం అయిన నేను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ వ్యక్తితో సినిమా చేసే స్థాయికి ఎదగాను. నేను చిన్నప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ గారిని ఫ్యాన్‌ని. ఖుషి సినిమా చూసి మా నాన్న అంబాసిడర్‌ కారు వేసుకుని హైదరాబాద్‌ వచ్చిన కుర్రాడిని.. ఇప్పుడు ఆయన పొలిటికల్‌ జర్నీలో భాగం అయి, ఆయన వెనకల అడుగులో అడుగులు వేసి వెళ్లగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసుకుని ఉంటాను అనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత బన్నీవాసు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>