PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-bharathie668c1e9-7f64-4d93-bee3-b22b51b23a50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-bharathie668c1e9-7f64-4d93-bee3-b22b51b23a50-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలలో ఏకంగా 151 స్థానాలు కట్టబెట్టిన‌ వైసీపీకి.. ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఇక జగన్ కుటుంబ విషయానికి వస్తే ఒకప్పుడు జగన్ తల్లి వై. ఎస్. విజయమ్మ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉండేవారు. జగన్ సోదరి వైయస్ షర్మిల రెడ్డి తన అన్నకు వెన్నుదన్నుగా ఉండేవారు. ys. bharathi{#}Sharmila;Jagan;YCP;Andhra Pradeshరంగంలోకి వైఎస్‌. భార‌తి.. జ‌గ‌న్ ఆ గ్రౌండ్‌లో బిగ్ గేమ్ మొద‌లు పెట్టారా..?రంగంలోకి వైఎస్‌. భార‌తి.. జ‌గ‌న్ ఆ గ్రౌండ్‌లో బిగ్ గేమ్ మొద‌లు పెట్టారా..?ys. bharathi{#}Sharmila;Jagan;YCP;Andhra PradeshWed, 14 Aug 2024 16:05:18 GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో ఊహించని విధంగా దెబ్బ తిన్నారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ పార్టీకి మరోసారి అధికారం క‌ట్టబెడతారని.. తాను మరో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని ఎన్నో కలలు కన్నారు. 2019 ఎన్నికలలో ఏకంగా 151 స్థానాలు కట్టబెట్టిన‌ వైసీపీకి.. ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఇక జగన్ కుటుంబ విషయానికి వస్తే ఒకప్పుడు జగన్ తల్లి వై. ఎస్. విజయమ్మ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉండేవారు. జగన్ సోదరి వైయస్ షర్మిల రెడ్డి తన అన్నకు వెన్నుదన్నుగా ఉండేవారు. జగన్ భార్య వైయస్ భారతి రెడ్డి అసలు బయటకు వచ్చేవారు కాదు.


జగన్ జైలులో ఉంటే తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఉప ఎన్నికలలో వైసీపీ గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత కూడా షర్మిల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికలలోను తల్లి, చెల్లిని జగన్ బాగా వాడుకున్నారు. జగన్ ఎప్పుడు..? అయితే ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పటి నుంచి తల్లితోనూ, చెల్లితోను గ్యాప్ వచ్చేసింది. షర్మిలను పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు పూర్తిగా భారతి పెత్తనం కొనసాగింది. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల కోసం కష్టపడాలి. అయితే గతంలోలా తల్లి, చెల్లి ఇప్పుడు జగన్ వెంట లేరు. పైగా చెల్లి షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు.


ఈ క్రమంలోని జగన్ సరికొత్త గ్రౌండ్ రెడీ చేసుకొని.. కొత్త ఆట ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తన సతీమణి వైయస్ భారతీ రెడ్డిని రంగంలోకి తీసుకువచ్చే అంశంపై గత నాలుగు రోజులుగా జగన్ కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీ రెడ్డి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. వచ్చినా ఆమె కడప జిల్లా వరకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఆమెకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి కట్టబెట్టి ఆమె దూకుడు పెంచేలా చేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి భారతిని రాష్ట్రం అంతా పర్యటించేలా చేసి.. మహిళల ఓటు బ్యాంకు తన వైపుకు తిప్పుకునేలా అస్త్రంగా వాడుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>