PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hyerabad-mumbai-nh65-vijayawafda-telugu-states-highway0b78d118-6fe0-4c91-97d3-a5a4336f8401-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hyerabad-mumbai-nh65-vijayawafda-telugu-states-highway0b78d118-6fe0-4c91-97d3-a5a4336f8401-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే చిన్న చిన్న రోడ్లు ఇరుకైన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. పూర్తిగా రోడ్లు అప్ గ్రేడ్ అయ్యాయి. హైవే ల నుంచి నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ హైవేలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలా మన దేశంలో చెప్పుకోవలసిన సూపర్ హైవే ముంబై టు హైదరాబాద్ ను కలుపుతూ ఉన్నటువంటి జాతీయ రహదారి. ఈ రహదారి గుండా రోజు వేలాది వాహనాలు ప్రయాణం చేస్తాయి. వేలాదిమంది ఈ రహదారి వెంబడి బ్రతుకుతారు. అలాంటి ఈ రహదారిHYERABAD; MUMBAI; NH65; VIJAYAWAFDA; TELUGU STATES HIGHWAY{#}Mumbai;Pune;Vijayawada;Sangareddy;vehicles;Hyderabad;Telangana;Andhra Pradeshకొత్త తెలుగు రహదారులు: ప్రయాణికులకు రాజబాట.. హైదరాబాద్ to ముంబై హైవే.!కొత్త తెలుగు రహదారులు: ప్రయాణికులకు రాజబాట.. హైదరాబాద్ to ముంబై హైవే.!HYERABAD; MUMBAI; NH65; VIJAYAWAFDA; TELUGU STATES HIGHWAY{#}Mumbai;Pune;Vijayawada;Sangareddy;vehicles;Hyderabad;Telangana;Andhra PradeshTue, 13 Aug 2024 09:25:01 GMT-దేశంలోనే రిచెస్ట్ హైవేగా పేరు..
-నిత్యం వేలాది వాహనాల ప్రయాణం..
- హైదరాబాద్ to ముంబై ప్రయాణికులకు మహర్దశ..

 ఒకప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే చిన్న చిన్న రోడ్లు ఇరుకైన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసేవారు. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. పూర్తిగా రోడ్లు అప్ గ్రేడ్ అయ్యాయి. హైవే ల నుంచి నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్ హైవేలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలా మన దేశంలో  చెప్పుకోవలసిన సూపర్ హైవే ముంబై టు హైదరాబాద్ ను కలుపుతూ ఉన్నటువంటి జాతీయ రహదారి. ఈ రహదారి గుండా  రోజు వేలాది వాహనాలు ప్రయాణం చేస్తాయి. వేలాదిమంది ఈ రహదారి వెంబడి బ్రతుకుతారు. అలాంటి ఈ రహదారి  ప్రయాణికులకు రాజబాటగా మారింది. మరి ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా కలుపుకొని వెళ్తుందో ఇప్పుడు చూద్దాం..
 
హైదరాబాద్ టు ముంబై:
 ఎన్ హెచ్ 65 ..దీన్ని దేశంలోనే రిచెస్ట్ హైవేగా పిలుస్తుంటారు. హైదరాబాద్ నుంచి పశ్చిమాన  ఏ రూట్ అయితే ఉంటుందో దాన్ని  హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అని పిలుస్తారు. నేషనల్ హైవే 65 అనేది మహారాష్ట్ర, పూణే దగ్గర మొదలై  కర్ణాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయి  మచిలీపట్నం దగ్గర ఎండ్ అవుతుంది. నేషనల్ హైవే 65 రెండు భాగాలుగా డివైడ్ చేశారు. ఇందులో ఒకటి తూర్పున ఉండే భాగం. హైదరాబాదు నుండి చౌటుప్పల్, సూర్యాపేట, కోదాడ, నందిగామ, విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు ఉంటుంది. దీన్ని హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పిలుస్తారు. ఇక రెండవది పశ్చిమ భాగంలో ఉండే హైదరాబాద్ టు ముంబై హైవే. పూణే నుండి టెంబుర్ని,  సోలాపూర్, నల్బుర్గ్, హోమనాబాద్, ఒమార్గ, బసవ కళ్యాణం, జహీరాబాద్, సంగారెడ్డి మీదుగా హైదరాబాద్ కలుస్తుంది.


ఈ విధంగా ముంబై లాంటి మహానగరం నుంచి మన హైదరాబాదు కనెక్టివిటీ ఉండడం వల్ల చాలావరకు డెవలప్మెంట్ అవుతోంది.  మొత్తం 700 కిలోమీటర్లు ఉన్న ఈ డిస్టెన్స్ లో ఎక్కువగా హెవీ వెహికల్సే ప్రయాణిస్తూ ఉంటాయి. దీనివల్ల  ఈ రూట్ వెంబడి ఉండేటువంటి గ్రామాలు,పట్టణాలు ఎంతో డెవలప్ అయ్యాయి. భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య ప్రజలకు కూడా అనేక లాభాలు వచ్చే విధంగా భూముల రేట్లు పెరిగాయి. అలాగే రవాణా సౌకర్యం అద్భుతంగా ఉంది కాబట్టి చాలా వరకు ఈ హైవే వెంబడే కంపెనీలు, కాలేజీలు ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలయ్యాయి. ఈ విధంగా ముంబై నుంచి హైదరాబాద్ కు ఉండేటటువంటి నేషనల్ హైవే 65  ప్రయాణికులకు రాజబాటగా చెబుతూ ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>